ఇండియన్ ఫొటోగ్రాఫర్‌తో రష్యన్ యువతి క్యూట్ ఇంటరాక్షన్.. వీడియో వైరల్..??

ప్రస్తుతం మరియా చుగురోవా ( Maria Chugurova )అనే రష్యన్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇండియాలో తిరుగుతూ అద్భుతమైన క్షణాలను ఆస్వాదిస్తోంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ @mariechugలో ఒక హార్ట్ టచింగ్ వీడియోను పోస్ట్ చేసింది.

 Russian Girl's Cute Interaction Video With Indian Photographer Goes Viral, Russi-TeluguStop.com

ఈ వీడియోలో ఆమె ముంబైలోని ఐకానిక్ గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద కుల్ఫీ అనే పాపులర్ ఇండియన్ డెజర్ట్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపిస్తుంది.

వీడియోలో ఆమె ఒక లోకల్ ఫోటోగ్రాఫర్‌ను( local photographer ) కూడా కలుస్తుంది.ఆ ఫోటోగ్రాఫర్ కేవలం రూ.50కే ఆమె ఫోటో తీస్తానని, ఒక నిమిషంలోనే ఫోటోను అందించగలనని చెబుతాడు.ఫాస్ట్ ఫోటో సర్వీస్ చూసి ఆశ్చర్యపోతుంది మరియా.ఫోటో నిజంగానే నిమిషంలోనే రెడీ అవుతుందా అని అడుగుతుంది.దీనికి ఫోటోగ్రాఫర్ అవును అని సమాధానం ఇస్తాడు.అప్పుడు మరియా గేట్‌వే ఆఫ్ ఇండియా ( Maria Gateway of India )నేపథ్యంలో తన ఫోటో తీయించుకోవాలని నిర్ణయించుకుంటుంది.

ఆమె ఫోటోగ్రాఫర్‌ను నేను బాగున్నానా? అని అడుగుతుంది, దీనికి ఫోటోగ్రాఫర్ చాలా బాగున్నారు అంటూ స్పందిస్తాడు.

ఫోటోగ్రాఫర్ నైపుణ్యాలకు, ఫ్రెండ్లీ పర్సనాలిటీకి ముగ్ధురాలైన మరియా అతని పేరు, ఇతర వివరాలను అడుగుతుంది.ఈ సమయంలో ఫోటోగ్రాఫర్ త్వరగా ఒక అందమైన ఫోటోను ప్రింట్ చేసి ఆమెకు అందిస్తాడు.మరియా తన ఫోటో అంత త్వరగా రావడానికి చూసి ఆశ్చర్య పోతుంది.

వీడియోలో ఈ మధురమైన సంభాషణను మాత్రమే కాకుండా, స్థానిక సంస్కృతి, ప్రజల పట్ల ఆమెకున్న నిజమైన ప్రేమ కనిపిస్తుంది.

తన పోస్ట్‌లో, మరియా చివరకు ప్రసిద్ధ గేట్‌వే ఆఫ్ ఇండియాను సందర్శించడం గురించి తన ఉత్సాహాన్ని వ్యక్తం చేసింది, ఇది చాలా కాలంగా ఆమె చూడాలని కోరుకున్న ఒక ప్రదేశమట.ఒక రోజు క్రితం మాత్రమే షేర్ చేసిన ఆమె వీడియో 40 లక్షలకు పైగా వ్యూస్‌తో వైరల్ అయ్యింది.పోస్ట్‌కు ఆమె ఫాలోవర్ల నుంచి అనేక రకాల రియాక్షన్లు వచ్చాయి, వీరిలో చాలా మంది కామెంట్ సెక్షన్‌లో హార్ట్ ఎమోజీలను షేర్ చేశారు.

మిగతావారు మరియా ఇండియన్ ఫోటోగ్రాఫర్ తో చాలా ఆప్యాయంగా మాట్లాడిన తీరును ప్రశంసించారు ఆమె హిందీ కూడా మాట్లాడడానికి ప్రయత్నించిందని ఇంకొందరు పొగిడారు.ఈ రష్యన్ అమ్మాయి భారతీయ వస్త్రాలలో చాలా అందంగా ఉందని మరి కొంతమంది అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube