సాధారణంగా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్ ఖచ్చితంగా ఉంది.కానీ కొన్ని సంవత్సరాల క్రితం కొంత మంది ఇంట్లోనే ఫ్రిడ్జ్ ఉండేది.
ఆ సమయంలో కూరగాయలను, గుడ్లను మరి ఏ ఆహార పదార్థాలైనా ఇంట్లోని పరిశుభ్రమైన ప్రదేశంలో ఉంచేవారు.కానీ ఇప్పుడు ఫ్రిడ్జ్ ప్రతి ఇంట్లో ఉండడం వల్ల ఏ ఆహార పదార్థాన్ని నైనా తాజాగా ఉండడం కోసం ఫ్రీజ్ లోనే ఉంచుతున్నారు.
కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిజ్లో ఉంచకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్క ఆహార పదార్థాలను ఫ్రిజ్లో ఉంచి తినడం ప్రజలందరికీ అలవాటుగా మారిపోయింది.కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలను ఫ్రిజ్లో అసలు ఉంచకూడదు.ఆహార పదార్థాలు ఏమిటంటే, ముఖ్యంగా గుడ్లను ఫ్రిజ్లో అసలు ఉంచకూడదు.ఎందుకంటే గుడ్లు ఫ్రిజ్లో పెడితే పాడైపోతాయి.నీరు పెంకులపై చేరి పగుళ్లు ఏర్పడి బ్యాక్టీరియా సులభంగా లోపలికి వెళ్ళిపోతుంది.కాబట్టి గుడ్లను ఫ్రిజ్లో ఉంచి తినడం వల్ల ఆరోగ్యం పై చెడు ప్రభావం పడే అవకాశం ఉంది.

అంతేకాకుండా పండ్లను కూడా ఫ్రిజ్లో పెట్టకూడదు.ఎందుకంటే వీటిలో ఉండే నీరు ఫ్రీజింగ్ అయి పండ్ల రుచి మారిపోతుంది.ఇంకా చెప్పాలంటే బంగాళదుంపలు ఫ్రిజ్లో పెట్టడం వల్ల సులభంగా చెడిపోతాయి.కాబట్టి ఈ బంగాళదుంపలను కూడా ఫ్రిజ్లో అసలు ఉంచకూడదు.ముఖ్యంగా కీర దోసకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది.కాబట్టి వీటిని కూడా ఫ్రిజ్లో ఉంచడం మంచిది కాదు.
అంతేకాకుండా బ్రెడ్ ను కూడా ఫ్రిజ్లో ఉంచకూడదు.ఇది తేమను పిలుచుకొని వెంటనే పాడైపోయే అవకాశం ఉంది.
ఫ్రిజ్లో ఉంచి బ్రెడ్ ను తినడం వల్ల ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుంది.