బాలికపై వలసదారుడి అత్యాచారం : వార్తా కథనంపై భారత సంతతి నేత ప్రమీలా జయపాల్ నవ్వులు, వివాదం

అక్రమ వలసదారుల కారణంగా అమెరికాలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి.దోపిడీలు, బెదిరింపులు, హత్యలతో వారు అగ్రరాజ్యాన్ని వణికిస్తున్నారు.

 Indian Origin Rep. Pramila Jayapal Laughs At News Coverage Of Migrant Who Raped-TeluguStop.com

అధ్యక్షుడు బైడెన్ ( President Biden )ఇమ్మిగ్రేషన్ విధానాలపై రిపబ్లికన్లు సైతం మండిపడుతున్నారు.తాజాగా ఎంఎస్ఎన్‌బీసీలో జాయ్ రీడ్ హోస్ట్ చేసిన ఇంటర్వ్యూలో భారత సంతతికి చెందిన యూఎస్ కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్( Pramila Jayapal ) పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అక్రమ వలసదారుల అంశం వీరి మధ్య ప్రస్తావనకు వచ్చింది.క్వీన్స్‌పార్క్‌లో వలసదారుడి చేతిలో అత్యాచారానికి గురైన 13 ఏళ్ల బాలిక కేసు గురించి ఫాక్స్ న్యూస్‌ నివేదించిన కథనాన్ని వ్యాఖ్యాత చదువుతుండగా జయపాల్ నవ్వుకోవడం వివాదాస్పదమైంది.

Telugu Giovanniinga, Indianorigin, Msnbc, York, Pramila Jayapal, Biden-Telugu To

దేశ జనాభాలో అధిక శాతం మంది అక్రమ వలసదారుల బహిష్కరణకు అనుకూలంగా ఉన్నారని రీడ్.హైలైట్ చేయడంతో వీరి సంభాషణ ప్రారంభమైంది.దీనిపై ప్రమీలా జయపాల్ స్పందిస్తూ.

అక్రమ వలసదారులను వారి పనిని సులభంగా చేయనివ్వడమే దీనిని ఎదుర్కోవడానికి మంచి మార్గమని వాదించారు.న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.

గత పదేళ్లుగా దేశంలో నివసిస్తున్న అమెరికా పౌరుల వలస జీవిత భాగస్వాములకు శాశ్వత నివాస హోదాను పొడిగించాలన్న బైడెన్ ఆదేశాలతో భయాందోళనలు పెరిగాయని ప్రమీలా అన్నారు.ఈ క్రమంలోనే 13 ఏళ్ల న్యూయార్క్ ( New York )బాలికపై అత్యాచారం చేసిన వలసదారుడిని అరెస్ట్ చేసినట్లు రీడ్ చదివి వినిపించారు.

ఈ క్రమంలోనే జయపాల్ నవ్వగా.సమస్యలో అది భాగమని తాను భావిస్తున్నానని హోస్ట్ చెప్పడంతో ప్రమీల అంగీకరించారు.

Telugu Giovanniinga, Indianorigin, Msnbc, York, Pramila Jayapal, Biden-Telugu To

కాగా.క్రిస్టియన్ జియోవన్నీ ఇంగా – లాండి అనే అక్రమ వలసదారు 13 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు ఈ దారుణాన్ని రికార్డ్ చేశాడు.2021లో దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన ఈ ఈక్వెడార్‌కు చెందిన 25 ఏళ్ల వలసదారుడు బాధితురాలిని, మరో అబ్బాయిని కత్తితో బెదిరించి బంధించాడు.అనంతరం బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.2022లో క్రిస్టియన్‌ను దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఇమ్మిగ్రేషన్ జడ్జి ఆదేశించారు.కానీ అతను ఆ ఆదేశాలను ధిక్కరిస్తూ అక్రమంగా ఉంటున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube