టీడీపీ క్యాడర్ కోసం సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు( Chandrababu ) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.గత వైసీపీ( YCP ) ప్రభుత్వంలో అమలు చేసిన పథకాల పేర్లు మార్చడం జరిగింది.

 Cm Chandrababu Sensational Decision For Tdp Cader, Cm Chandrababu, Tdp , Ycp, T-TeluguStop.com

ఆ తర్వాత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేయడం జరిగింది.ఇదిలా ఉంటే ఒకపక్క పాలనతో ప్రజలకు అందుబాటులోనే ఉంటూ మరోపక్క పార్టీ క్యాడర్ కి దూరం కాకూడదని సంచలన నిర్ణయం తీసుకున్నారు.

విషయంలోకి వెళ్తే ఇకనుంచి ప్రతి శనివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం నాయకులు మరియు కార్యకర్తలు.సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు పార్టీ ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్యేలకు తెలియజేయడం జరిగింది.మరోవైపు పార్లమెంటు సమావేశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు.దేశంలో ఈ నెల 24 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.దీంతో సీఎం చంద్రబాబు ఇటీవల టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పార్లమెంట్ లో ఏ రకంగా వ్యవహరించాలి అన్నదానిపై ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు.అంతేకాకుండా రాష్ట్రానికి రావలసిన నిధులు, సమస్యలను సభా దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ ఎంపీలకు సూచించడం జరిగింది.

ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉండటంతో సున్నితత్వం ప్రదర్శించాలని సూచించారు.బీజేపీ అగ్ర నాయకుల సహకారంతో రాష్ట్రానికి అధిక నిధులు మంజూరు అయ్యేలా కృషి చేయాలని టీడీపీ ఎంపీలకు చంద్రబాబు తెలియజేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube