టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్( Ram Charan ) క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సినిమాల కోసం ఎంతైనా కష్టపడే హీరోలలో రామ్ చరణ్ ముందువరసలో ఉంటారు.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా షూట్ పనులతో పాటు డబ్బింగ్ పనులను సైతం పూర్తి చేశారు.గేమ్ ఛేంజర్ సినిమాలో( Game changer ) చరణ్ పాత్రకు సంబంధించిన షూట్ మాత్రమే పూర్తైందని బ్యాలెన్స్ సన్నివేశాలు ఉన్నాయని భోగట్టా.
రామ్ చరణ్ తర్వాత సినిమాకు సంబంధించిన ట్రైనింగ్ కోసం 2 నెలల పాటు ఆస్ట్రేలియాకు( Australia ) వెళ్లనున్నారని సమాచారం అందుతోంది.ఆస్ట్రేలియాలో స్పెషల్ ట్రైనింగ్ కోసం చరణ్ వెళ్లారని తెలుస్తోంది.
చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో రామ్ చరణ్ శిక్షణ తీసుకుంటున్నారని భోగట్టా.అయితే విదేశాలకు వెళ్లిన సమయంలో చరణ్ హెల్త్ కు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
విదేశాల్లో వాతావరణం భిన్నంగా ఉండటంతో పాటు ఆహారపు అలవాట్లను సైతం మార్చుకోవాల్సి ఉంటుందనే సంగతి తెలిసిందే.అందువల్ల చరణ్ కు ఫ్యాన్స్ సూచనలు చేస్తున్నారు.మరోవైపు రామ్ చరణ్ రెమ్యునరేషన్ పరంగా టాప్ లో ఉన్నారు.ఈ సినిమాకు చరణ్ 125 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకున్నారనే సంగతి తెలిసిందే.
చరణ్ సినిమాలు అత్యంత భారీ బడ్జెట్లతో తెరకెక్కుతున్నాయి.
రామ్ చరణ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్స్ ను ఎంచుకుని విజయాలను అందుకుంటే భారీ విజయాలు దక్కుతాయని చెప్పవచ్చు.రామ్ చరణ్ ఇతర భాషలపై కూడా దృష్టి పెట్టి కెరీర్ పరంగా మరింత ఎదిగితే చూడాలని ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.రామ్ చరణ్ రెమ్యునరేషన్ పరంగా కూడా టాప్ స్టేజ్ లో ఉన్నారు.
చరణ్ సినిమాలు కలెక్షన్ల పరంగా సైతం అదరగొడుతున్నాయి.