గత వైసిపి ప్రభుత్వం కంటే భిన్నంగా టిడిపి కూటమి ప్రభుత్వ పాలన ఉంటుందని అంతా అంచనా వేశారు.దీనికి తగ్గట్లుగానే టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu naidu ) కూడా ఏ కక్ష సాధింపు చర్యలు ఉండవని ప్రకటించారు.2019 ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదికను కూల్చడం పై అనేక విమర్శలు వ్యక్తం అయ్యాయి.ఇప్పటికీ రాజకీయంగా జగన్ కు ఇబ్బందికరంగానే మారింది.
అయితే ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన టిడిపి కూటమి ప్రభుత్వం వైసిపిని టార్గెట్ చేసుకున్నట్లుగానే కనిపిస్తోంది.ఈ మేరకు వైసిపి కేంద్ర కార్యాలయం కూల్చివేతలు మొదలుపెట్టారు .గతంలో వైసిపి ప్రభుత్వం అనుసరించిన విధానాలకు ప్రతీకారంగా ఈ కూల్చివేతలు కనిపిస్తున్నాయి.
ఈరోజు తెల్లవారుజాము నుంచే తాడేపల్లి( Tadepalle )లో కొత్తగా నిర్మిస్తున్న వైసిపి కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేయడం ప్రారంభించారు.ఈరోజు తెల్లవారుజాము నుంచి వచ్చిన సిబ్బంది వైసిపి కేంద్ర కార్యాలయ భవన నిర్మాణాల కూల్చివేత మొదలుపెట్టారు. దీనిపై వైసీపీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.
నిన్ననే వైసీపీ నేతలు కోర్టును ఆశ్రయించారు.దీనిపై హై కోర్టు చట్టాన్ని అధిగమించి వ్యవహరించవద్దని సూచించింది.
సిఆర్డిఏ అధికారులకు హైకోర్టు ఆదేశాలను వైసీపీ తరుపున న్యాయవాది తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది .</br
భారీ పోలీస్ బందోబస్తు మధ్య మున్సిపల్ అధికారులు ఈరోజు తెల్లవారుజాము నుంచే కూల్చివేతలు ప్రారంభించారు.ఈ వ్యవహారంపై తాజాగా వైసిపి అధినేత జగన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.రాజకీయ కక్ష సాధింపులకు చంద్రబాబు ప్రభుత్వం దిగిందని జగన్( YS jagan ) విమర్శించారు.
హైకోర్టు ఆదేశాలను కూడా బేకాతర చేస్తూ ప్రభుత్వం కావాలనే ఈ కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని తెలిపారు .ఈ కూల్చివేతల వ్యవహారం రాజకీయంగా మరో రచ్చకు కారణం అవుతోంది.దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు వైసిపి నేతలు సిద్ధమవుతున్నారు.