ప్రభాస్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కల్కి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ విషయంలో ట్విస్ట్ ఇదే!

టాలీవుడ్ హీరో ప్రభాస్( Prabhas ) హీరోగా నటించిన తాజా చిత్రం క‌ల్కి 2898AD( Kalki 2898AD ).ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

 Latest News About Kalki Movie, Kalki Movie, Tollywood, Ott, Striming Date ,kalki-TeluguStop.com

ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటించింది.అంతేకాకుండా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి స్టార్ సెలబ్రెటీలు కూడా ఇందులో కీలక పాత్రల్లో నటించారు .వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్( Vyjayanthi Movies Banner ) పై నిర్మితమైన ఈ సినిమా జూన్ 27 ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదల కానుంది.విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ఇప్పటికే ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, అప్డేట్లు ఫొటోస్ సినిమాపై అంచనాలను పెంచాయి.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కాగా ఇటీవల కాలంలో ఎలాంటి సినిమా అయిన థియేటర్స్ లో విడుదల అయిన కొద్ది రోజులకే ఓటీటీ( Ott ) లో కొద్ది రోజులకే విడుదల అవుతుండడంతో చాలా మంది ప్రేక్షకులు సినిమా థియేటర్స్ కీ వెళ్లడమే మానేసారు.పైగా విడుదలైన వారం నుంచి నాలుగు వారాల లోపు ఓటిటి లోకి వచ్చేస్తోంది.

కానీ కల్కి విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకున్నామని, 56 రోజుల వరకు ఓటీటీ లోకి రాదని యూనిట్ వర్గాల బోగట్టా.అలాగే వీలయినంత వరకు అర్థరాత్రి, ఒంటిగంటకు షోలు లేకుండా జాగ్రత్త పడుతున్నారట.నిద్ర కళ్లతో, సింగిల్ థియేటర్లలో అర్థరాత్రి సినిమా చూడడం, ఇలా వుంది అలా వుంది అంటూ టాక్ స్ట్రెడ్ చేయడం అవసరమా? అనే ఆలోచనలో వుందట చిత్ర యూనిట్.అయిదు గంటల నుంచే షో లు ఎక్కువగా పడతాయని తెలుస్తోంది.

అనివార్యం అయితే కొన్ని చోట్ల అర్థరాత్రి దాటిన తరువాత ఒకటి రెండు షో లు పడే అవకాశం వుందంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube