పదేళ్ల కల నెరవేరింది...నాగబాబు ఎమోషనల్ పోస్ట్ వైరల్!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.ఇటీవల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా గెలిచిన వారందరూ కూడా అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు ఈ క్రమంలోనే  మొదట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయగా అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు.

 Nagababu Emotional Tweet Viral About Pawan Kalyan Oath As Mla In Ap Assembly, Pa-TeluguStop.com

ఇలా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ ఈయన ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో అసెంబ్లీ గ్యాలరీలో కూర్చున్నటువంటి నాగబాబు( Nagababu )ఎంతో ఎమోషనల్ అయ్యారు.

ఈ క్రమంలోనే నాగబాబు సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.పదేళ్ల కల నెరవేరింది.ప్రజాప్రస్థానం మొదలైంది.డిప్యూటీ సీఎం హోదాలో శాసనసభలో ప్రమాణస్వీకారం చేస్తున్నటువంటి నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ని చూసి నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది.తోడబుట్టిన వాడిగా, జనసేన కార్యకర్తగా మా నాయకుడి ప్రమాణస్వీకారం చూసి నా గుండె ఆనందంతో నిండిపోయింది.

పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్ళాలి అక్కడ పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ ప్రమాణం చేయడం సంతోషంగా ఉంది.అయితే అసెంబ్లీకి వెళ్లి అక్కడ గ్యాలరీలో కూర్చోవడం చాలా థ్రిల్ గా అనిపించింది.మా కుటుంబం మొత్తం పవన్ కళ్యాణ్ అద్భుతమైన విజయం సాధించడంతో సంతోషంగా ఉన్నామని తెలిపారు.

ఇలాంటి గెలుపునిచ్చిన ప్రతి ఒక్క ఓటర్ నమ్మకాన్ని అనుక్షణం నిలబెట్టుకుంటూ తనకి కేటాయించిన అన్ని మంత్రిత్వ శాఖలకి నిజాయితీతో, నిష్పక్షపాతంగా అన్ని విధాల అంతఃకరణ శుద్ధితో న్యాయం చేస్తాడని నిర్భయంగా చెబుతున్నాను అంటూ ఈయన చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube