కల్కి రిలీజ్ ట్రైలర్ లో ఈ నటిని గమనించారా.. మళ్లీ సెంటిమెంట్ రిపీట్ చేశారుగా!

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం కల్కి( Kalki ).డార్లింగ్ ప్రభాస్( Prabhas ) హీరోగా నటించిన ఈ సినిమా ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

 Surprising Element From Kalki 2898 Ad Trailer About A Heroine, Kalki 2898, Tolly-TeluguStop.com

నాగ్ అశ్విన్ ( Nag Ashwin )దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే విడుదల తేదీకి మరికొద్ది రోజులే సమయం ఉండడంతో ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది చిత్ర యూనిట్.

Telugu Kalki, Malavika Nair, Tollywood, Trailer-Movie

ఈ సినిమాలో అతిధి పాత్రలో ఉన్నాయని ఇంతకుముందు వైద్యయంతి నెట్వర్క్ చిత్రాల్లో సందడి చేసిన కొందరు ఆ క్యారెక్టర్లు ప్లే చేస్తున్నారని ఇటీవల ప్రచారం జరిగింది.దీనిపై చిత్ర బృందం ఇప్పటివరకూ స్పందించలేదు.కానీ తాజాగా విడుదల అయిన రిలీజ్‌ ట్రైలర్‌ లో ఒక హీరోయిన్‌ను చూపించి అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసింది.

ఆ నటి మరెవరో కాదు.మాళవిక నాయర్( Malvika Nair ).గతంలో వైజయంతీ నెట్‌వర్క్‌ బ్యానర్‌లలో తెరకెక్కిన ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాల లోను ఆమె కీలక పాత్రలు పోషించి, మెప్పించారు.

Telugu Kalki, Malavika Nair, Tollywood, Trailer-Movie

దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ఈ మూడు చిత్రాల్లో ఆమె నటించడం విశేషం.అదే నెట్‌వర్క్‌లో వచ్చిన అన్నీ మంచి శకునములే లోనూ ఆమె సందడి చేశారు.ట్రైలర్‌ లోని తన లుక్‌ని స్క్రీన్‌ షాట్‌ తీసి, అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా మాళవిక ఆనందం వ్యక్తంచేశారు.

వాటిని తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేస్తూ థ్యాంక్స్‌ చెప్పారు.కొన్ని రోజుల క్రితం విడుదలైన తొలి ట్రైలర్‌ ద్వారా ఈ సినిమాలో అలనాటి హీరోయిన్‌ శోభన ఉన్నారని తెలిసింది.

ఆ తర్వాత చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఆమె లుక్‌ని షేర్‌ చేసింది.విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారని రూమర్స్‌ వచ్చాయి.

నాగ్‌ అశ్విన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.ఎన్నో సర్‌ప్రైజ్‌ లు ఉంటాయి అని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube