జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎన్నికల్లో గెలిచాక డిప్యూటీ సీఎం అయ్యాక.కీలకంగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే తన శాఖకు సంబంధించిన అధికారులతో సమావేశమై పలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఇదిలా ఉంటే శనివారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం పవన్ కళ్యాణ్ మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీస్( Janasena party office in Mangalagiri ) ప్రధాన కార్యాలయం బయట “ప్రజా దర్బార్” నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తమ బాధలు చెప్పుకోవడం జరిగింది.దీంతో పవన్ కళ్యాణ్ ఆఫీస్ ముందే కుర్చీలు వేసుకుని బాధితులతో మాట్లాడి అర్జీలు తీసుకున్నారు.
కొన్ని అర్జీలకు సంబంధించి అప్పటికప్పుడు పరిష్కారాలు చూపెడుతూ అధికారులతో ఫోన్ లో సంభాషించటం జరిగింది.ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి బాధితులతో సమావేశం కావటం తర్వాత పరిష్కారానికి తగు హామీలను ఇవ్వటం జరిగింది.ప్రజా సమస్యలను ఓపికగా విని సమస్యల పరిష్కారానికి భరోసా ఇవ్వటం జరిగింది.ప్రతిపక్షంలో ఉన్న సమయంలో “జనవాణి”( janavani ) పేరిట ప్రజా సమస్యలు అప్పట్లో తెలుసుకున్నారు.
ఇప్పుడు అధికారంలో వచ్చాక ఉప ముఖ్యమంత్రిగా అదే రకంగా పవన్ వ్యవహరించడంతో జనసేన పార్టీ కార్యకర్తలు… పవన్ నాయకత్వాన్ని పొగుడుతున్నారు.మా నాయకుడు నిత్యం సామాన్యులకు అందుబాటులో ఉండే గొప్ప వ్యక్తి అంటూ సోషల్ మీడియాలో పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.