భారత సంతతికి చెందిన వ్యాపార కుటుంబం హిందూజా ఫ్యామిలీకి చెందిన నలుగురికి స్విట్జర్లాండ్ క్రిమినల్ కోర్ట్ నాలుగు నుంచి నాలుగున్నరేళ్ల జైలుశిక్ష విధించింది.వ్యాపారవేత్త ప్రకాష్ హిందూజా( Prakash Hinduja ) అతని భార్య, కుమారుడు , కోడలు .
జెనీవాలోని వారి విలాసవంతమైన లేక్‌సైడ్ విల్లాలో ఉద్యోగం చేసేందుకు నిరక్షరాస్యులైన భారతీయులను అక్రమ రవాణా చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి.ఈ కుటుంబానికి బిజినెస్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న ఐదవ ప్రతివాది నజీబ్ జియాజీ విచారణకు హాజరవుతుండగా.
హిందూజా ఫ్యామిలీలోని ( Hinduja family )నలుగురు మాత్రం కోర్టులో లేరు.ఈ కేసులో జియాజీకి 18 నెలల సస్పెండ్ శిక్షను విధించింది కోర్ట్.
అయితే న్యాయస్థానం తీర్పుపై అప్పీల్ చేస్తామని నిందితుల తరపు న్యాయవాదులు తెలిపారు.కార్మికులను దోపిడీ చేయడం, అనధికారికంగా ఉపాధి కల్పించడం వంటి అభియోగాలపై ఈ నలుగురిని కోర్ట్ దోషులుగా తేల్చింది.నలుగురు హిందూజా కుటుంబ సభ్యులు కార్మికుల పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకోవడం, స్విస్ ఫ్రాంక్లలో కాకుండా రూపాయలలో చెల్లింపులు , విల్లా నుంచి బయటకు రాకుండా అడ్డుకోవడం, తక్కువ ధరకు ఎక్కువ గంటలు పనిచేసేలా బలవంతం చేయడం వంటి ఆరోపణలు హిందూజా కుటుంబంపై వచ్చాయి.కొన్ని సమయాల్లో సదరు విల్లాలో సిబ్బంది, కుక్‌లు రోజుకు 18 గంటల పాటు పనిచేసేవారని న్యాయవాదులు ఆరోపించారు.
ఆ ఇంట్లోని ఉద్యోగులు హిందీలో మాత్రమే మాట్లాడతారని, వారు యాక్సెస్ చేయలేని బ్యాంకుల్లో వారి వేతనాలను భారతీయ రూపాయలలో చెల్లించేవారని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు.గత వారం భారత మూలాలున్న ఒక కుటుంబం.
ఫిర్యాదిదారులతో రాజీ కుదుర్చుకునేందుకు యత్నించిందని క్రిమినల్ కోర్ట్ విచారణలో తేలింది.
స్విస్ అధికారులు ఇప్పటికే హిందూజా కుటుంబం నుంచి వజ్రాలు, కెంపులు, ప్లాటినం నెక్లెస్ ఇతర ఆభరణాలు, ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.జరిమానాలు , చట్టపరమైన ఫీజులను చెల్లించడానికి వీటిని ఉపయోగిస్తారనే అనుమానంతో వాటిని సీజ్ చేశారు.జెనీవా ప్రాసిక్యూటర్లు దోపిడీ, మానవ అక్రమ రవాణా, స్విస్ కార్మిక చట్టాలను ఉల్లంఘించడం వంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించి కేసును ప్రారంభించారు.
హిందూజా కుటుంబం దశాబ్ధాల క్రితం స్విట్జర్లాండ్‌లో స్థిరపడింది.ప్రకాష్ హిందూజాకు 2007లోనూ ఇదే విధమైన శిక్ష పడింది.సరైన పత్రాలు లేకుండా ఉద్యోగులను నియమించుకోవడంపై ఆయన అప్పట్లో దోషిగా తేలారు.అలాగే 2000లో స్విస్ పౌరసత్వం పొందిన ప్రకాష్ హిందూజాపై స్విస్ అధికారులు నమోదు చేసిన పన్ను కేసు ఒకటి పెండింగ్‌లో ఉంది.
ముగ్గురు సోదరులతో పాటు ప్రకాష్ హిందూజా.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీడియా, పవర్, రియల్ ఎస్టేట్, హెల్త్ కేర్ వంటి రంగాలలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.
ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం ప్రస్తుతం హిందూజా కుటుంబం నికర సంపద విలువ 20 బిలియన్ డాలర్ల పై మాటే.