ఎమ్మెల్యేగా బాలయ్య ప్రమాణ స్వీకారం...ఎమోషనల్ పోస్ట్ చేసిన బ్రాహ్మిణి!

సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ( Balakrishna ) ముచ్చటగా మూడోసారి హిందూపురం ( Hindupuram ) , ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.ఇటీవల పొట్రెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య సమక్షంలో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీలో ప్రమాణం చేశారు.

 Nara Bramhini Emotional Post About Balakrishna , Nara Bramhini, Balakrishna, Oat-TeluguStop.com

ఈ క్రమంలోనే హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ ప్రమాణస్వీకారం చేశారు.ఇలా బాలకృష్ణ మూడోసారి హిందూపురం నియోజకవర్గం నుంచి అఖండమైన మెజారిటీతో గెలిచి అసెంబ్లీ లోకి అడుగుపెట్టడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Ap Assembly, Balakrishna, Bramhini, Oath Ceremony-Movie

ఈ క్రమంలోనే బాలకృష్ణ ప్రమాణస్వీకారం చేసిన ఫోటోలు వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.అయితే తన తండ్రి ఇలా మూడోసారి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయటంతో బాలయ్య పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి ( Nara Bramhini ) సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.ఈ సందర్భంగా నారా బ్రాహ్మిని ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.ముఖ్యంగా నాన్న నువ్వు ఎప్పుడు ప్రజలలో హీరోవి నిరంతరం ప్రజల గుండెల్లోనే ఉంటావు .వారి యొక్క సంతోషంలో నువ్వు కూడా ఒక భాగమే అందుకు తగ్గట్టుగానే శ్రమిస్తూ ఉంటావు ఆల్ ది బెస్ట్ నాన్న అంటూ నారా బ్రాహ్మణి చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Telugu Ap Assembly, Balakrishna, Bramhini, Oath Ceremony-Movie

ఇక బాలకృష్ణ 2014 సంవత్సరం నుంచి హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ భారీ మెజారిటీతో గెలుస్తూ ఉన్నారు.ఇప్పటివరకు ఈయన మూడుసార్లు విజయం సాధించారు.ఇలా ఈయన రాజకీయాలలో ఎమ్మెల్యేగా కొనసాగుతూనే మరోవైపు సినిమాలలో కూడా నటిస్తూ హీరోగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అయిన బాలకృష్ణ తాజాగా బాబీ డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు.ఈ సినిమా శరగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.ఈ సినిమా తర్వాత ఈయన బోయపాటి దర్శకత్వంలో అఖండ సీక్వెల్ సినిమాలో నటించబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube