సూర్యాపేట జిల్లా:కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ జిల్లా నాయకుడు డాక్టర్ వడ్డేపల్లి రవి మరియు 10వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్,అతని సతీమణి వడ్డేపల్లి రాజ్యలక్ష్మి గులాబీ పార్టీకి గుడ్ చెప్పారు.గత కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న దంపతులిద్దరూ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీని వీడుతున్నట్లు తెలిపారు.త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.
కారు దిగడానికి కారణాలు బహిర్గతం చేయకపోయినా పార్టీలో సరైన ప్రాతినిధ్యం లేకపోవడం,అంతర్గత వర్గ పోరే అసలు కారణమని గులాబీ శిబిరంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.