నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న శ్లోక స్కూల్ పై చర్యలు తీసుకోవాలి...!

జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న శ్లోక స్కూల్ పై చర్యలు తీసుకోవాలని డిఈఓ కార్యాలయంలో ఏడి శైలజకు పి.డి.ఎస్.యు.ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు.రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ మాట్లాడుతూ మార్చి 15 నుండి ఒక్క పూట బడి నిర్వహించాల్సి ఉండగా మంగళవారం వరకు కూడా అమలు చేయకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా శ్లోక స్కూల్ నడుస్తుందని ఆరోపించారు.ఐఐటీ, అదనపు క్లాసుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తూ ధనార్జేనే ధ్యేయంగా విద్యా వ్యాపారం చేస్తున్నారని అన్నారు.ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు స్కూల్ నిర్వహిస్తూ విద్యార్ధులను మానసిక ఒత్తిడికి గురి చేస్తూ,వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.

 Action Should Be Taken Against Shloka School Which Is Running Against The Rules,-TeluguStop.com

ఈ నేపంతో అందులో పని చేసే ఉపాధ్యాయుల శ్రమను దోచుకుంటూ, వారికి అరకొర జీతాలు ఇస్తూ ఇబ్బందులు పెడుతున్నారన్నారు.తక్షణమే ఎండ తీవ్రత నుండి విద్యార్ధులను కాపాడి,విద్యార్ధుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న శ్లోక స్కూల్ పై చర్యలు తీసుకొని, విద్యార్ధులను మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్.టి.యు.జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా రాంజీ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube