సూర్యాపేట జిల్లా: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా తమకు కోడ్ గీడ్ జాన్తా నై అంటూ యధేచ్చగా ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్రంలో గృహలక్ష్మి లబ్ధిదారుల ఇంటికి అధికార పార్టీ ప్రజా ప్రతినిధి శంకుస్థాపన చేయడం, అధికారులు చోద్యం చూస్తూ ఉండడం విస్మయం కలిగిస్తుంది.వివరాల్లోకి వెళితే చివ్వెంల మండల కేంద్రానికి చెందిన కోడి సైదమ్మ భర్త సైదులుకు గృహలక్ష్మి పథకంలో ఇల్లు మంజూరు అయింది.
ఈ లోపు ఎన్నికల కోడ్ కూసిన సంగతి తెలిసిందే.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల చెయ్యొద్దని నిబంధనలు ఉన్నా అవన్నీ మాకు వర్తించదని సైదమ్మ నూతన ఇంటి నిర్మాణ కోసం చివ్వెంల మండల బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు,మండల వైస్ ఎంపీపీ జూలకంటి జీవన్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేసి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు.
దీనిపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల కోడ్ కేవలం ప్రతిపక్షాల వారికే వర్తిస్తుందా? అధికార పార్టీ వారికి వర్తించదా? ప్రశ్నిస్తున్నారు.ఈ కార్యక్రమంలో చివ్వెంల మండల బీఆర్ఎస్ నాయకులు అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, జెజెఆర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.