రాజన్న సిరిసిల్ల జిల్లా :గ్రామీణ ప్రాంత యువతలో శక్తివంతమైన సామర్ధ్యాలను వెలికి తీయడానికి,చేడు అలవాట్లవైపు దారిమల్లకుండా, మాధకద్రవ్యాల వినియోగం ద్వారా కలిగే అనర్థాల పట్ల యువతలో అవగాహన పెంపొందించడం కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయిలో దోస్తీ మీట్ – 2024 క్రీడా (కబడ్డీ, వాలీబాల్ ) పోటీలు నిర్వహిస్తున్నట్లు ముస్తాబాద్ మండల( Mustabad Mandal) ఎస్సై శేఖర్ పేర్కొన్నారు.ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు.ఈ
సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖ(Police Department ) ఆధ్వర్యంలో దోస్తీ మీట్ – 2024 లో భాగంగా గ్రామీణ ప్రాంత యువత శక్తిసామర్ధ్యాలను వెలికి తీయడానికి,యువత చేడు అలవాట్ల వైపు దారిమల్లకుండా , మాధకద్రవ్యాల వలన కలుగు అనార్దలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి ఈ నెల 23,24 తేదీ ల లో మండల కేంద్రాల్లో కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని,ఆసక్తి గల యువతి, యువకులు తమ తమ జట్ల వివరాలు పోలీస్ స్టేషన్ లో 22 వ తేదీ లోపు నమోదు చేసుకోవాలని,వివరాల కోసం శ్రీనివాస్ పీసీ 98666 49293పీసీ రాజశేఖర్ సెల్ : 9666155150 ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి కూడా వివరాలు చెప్పొచ్చు.23 వ తేది గురువారంనుండి జూనియర్ కాలేజీ గ్రౌండ్ ముస్తాబాద్ లో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.ఈ పోటీలలో గెలుపొందిన జట్లకు తదుపరి జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతున్నారు.దోస్తీ మీట్ 2024 క్రీడా పోటీలలో ప్రతి గ్రామం నుండి తప్పనిసరి ఒకటి లేదా రెండు టీములు, క్రీడాకారులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు.