సూర్యాపేట జిల్లా:అధికార మంద బలంతో అహంకారపురితంగా రాజ్యాంగాన్ని బాజాప్త మారుస్తామంటూ,సెక్యులర్ పదమే ఉండనీయం అంటూ వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ అరవింద్ వ్యాఖ్యలను ప్రతీ ఒక్కరు ఖండించాలని ఆయనపై రాజద్రోహం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి డిమాండ్ చేశారు.అరవింద్ అహంకారపురిత వ్యాఖ్యలను నిరసిస్తూ కెవిపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని నల్లాలబావి సెంటర్లో బీజేపీ ఎంపీ అరవింద్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతములో కేసీఆర్ మాట్లాడినప్పుడుబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాజ్యాంగం జోలికి వస్తే నిన్ను తుకడ తుకడ చేస్తాం ఏది రాజ్యాంగాన్ని ముట్టుకొని చూడు బిడ్డ అని గట్టిగా వ్యాఖ్యానించాడని ఇప్పుడు మీ బీజేపీ ఎంపీ అరవింద్ ను కూడా తుకడ చేస్తారా? లేక ప్రజలు తుకడా చేయాలా చెప్పాలని డిమాండ్ చేశారు.రాజ్యాంగం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిని దేశ ద్రోహులుగా గుర్తించి జీవితాంతం బయటికి రాకుండా కఠిన శిక్షలు అమలు చేయాలని,రాజ్యాంగం అంటే గౌరవం లేనివారిని మనం నాయకులుగా ఎన్నుకొని రాజ్యాంగ రక్షణ చేయమని పంపుతున్నామని,ఇది దేశానికి మంచిది కాదని అన్నారు.
మనువాదంతో మూఢత్వంలో కూరుకుపోయిన వారికి లౌకిక వాదం గిరించి ఎలా తెలుస్తుందని మండిపడ్డారు.బరితెగించి,బలుపు మాటలు మాట్లాడిన ఎంపీ అరవింద్ ను బీజేపీ నుండి బహిష్కరించి,బండి సంజయ్ కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలని సూచించారు.
ఎంపీ అరవింద్ వ్యాఖ్యలను కెవిపిఎస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.ప్రజలు ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఎలుగురి గోవింద్,జె.నర్సింహారావు,చినపంగి నర్సయ్య,మామిడి సుందరయ్య,కెవిపిఎస్ జిల్లా నాయకులు బచ్చలకురి సురేందర్,విజయ్ తదితరులు పాల్గొన్నారు.