విద్యుత్ షాక్ తో గ్రామపంచాయతీ వర్కర్ మృతి

సూర్యాపేట జిల్లా:మద్దిరాల మండలం చందుపట్ల గ్రామానికి చెందిన గ్రామపంచాయితీ వర్కర్ (కారోబార్)యాటకారి మల్లయ్య(30) విద్యుత్ షాక్ తో మృతి చెందాడు.దీనికి కారణం గ్రామ సర్పంచ్,కార్యదర్శి నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు,బంధువులు మద్దిరాల మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు.

 Gram Panchayat Worker Died Due To Electric Shock-TeluguStop.com

స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం సోమవారం గ్రామంలో దసరా పండగ సందర్భంగా వీధి లైట్లు వేయాలని సర్పంచ్,కార్యదర్శి మృతుడు మల్లయ్యతో పాటు గ్రామ పంచాయతీ సిబ్బందిని పంపించారు.మల్లయ్య స్తంభం ఎక్కి లైట్ వేస్తుండగా ప్రమాదవశాత్తు అతని ఎడమ చెయ్యికి,ఛాతీభాగానికి విద్యుత్ షాక్ తగలడంతో క్రింద పడి మృతి చెందాడు.

ఈ సందర్భంగా మృతిని బంధువులు మాట్లాడుతూ సర్పంచ్,కార్యదర్శి ఒత్తిడి మూలంగానే కరెంట్ పై అవగాహన లేని మల్లయ్య స్తంభం ఎక్కాడని,గ్రామ పంచాయతీ సిబ్బందిని మల్టీ పర్పస్ విధానంలో వాడుకోవడంతోనే ఈ సంఘటన జరిగిందని ఆరోపించారు.సర్పంచ్,కార్యదర్శి కరెంటు ఎల్సి తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అందుకే షాక్ తగిలి మల్లయ్య చనిపోయాడన్నారు.

జరిగిన ప్రాణనష్టానికి సర్పంచ్,కార్యదర్శి భాద్యత వహించి మృతుని కుటుంబానికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.భవిషత్తులో ఇలాంటి సంఘటన జిల్లాలో ఎక్కడా జరగకుండా డిపిఓ, ఎంపీడీఓలు తక్షణ చర్యలు తీసుకోని,పంచాయితీ కార్యదర్శులను ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మృతిని కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేసి ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం తుంగతుర్తి నియోజకవర్గ భాద్యులు గౌడిచెర్ల సత్యనారాయణగౌడ్, గ్రామ పంచాయితీ వర్కర్ల జిల్లా అధ్యక్షులు కుశలవచారి,మద్దిరాల మండల అధ్యక్షులు తొణుకునూరి వెంకన్న,నూతనకల్ మండల గౌరవ అధ్యక్షులు లింగాల రాములు,అధ్యక్షులు శంభయ్య, గ్రామ పంచాయితీ వర్కర్స్ యూనియన్ నాయకులు, సిబ్బంది,బంధువులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube