కేసీఆర్ ఏఒక్క హామీని నెరవేర్చలేదు

నల్లగొండ జిల్లా:మొత్తానికి ఇన్ని రోజుల నుండి ఎప్పుడెప్పుడా మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల అవుతుందని రాష్ట్ర ప్రజలు అందరూ ఉత్కంఠగా ఎదురుచూశారని ఆగష్టు 4 న రాజగోపాల్ రెడ్డి తన రాజీనామాని ఆమోదించుకొని రెండు నెలల తరువాత షెడ్యూల్ విడుదల అయిందన్నారు.అందరూ దసరా తరువాత వస్తుందని చర్చించుకుంటున్న సందర్భంలో ఉప ఎన్నిక షెడ్యూల్ సోమవారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మిగతా రాష్ట్రాలలో ఉన్న కాలిలతో పాటుగా మునుగోడు ఉపఎన్నికకు కూడా డేట్ ఫిక్స్ చేసింది.

 Kcr Has Not Fulfilled Any Promise-TeluguStop.com

ఈసందర్బంగా సోమవారం రాజగోపాల్ రెడ్డి క్యాంపు ఆఫీస్ లో ఉపఎన్నిక ఇంచార్జ్ మాజీ ఎంపీ వివేక్ వెంకట్ స్వామితో కలసి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ మొత్తానికి అనుకున్నట్టుగానే ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చిందని అన్నారు.8 ఏళ్లుగా టిఆర్ఎస్ పార్టీ మునుగోడుకు చేసింది ఏమీ లేదని,ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు,చర్లగూడెం ప్రాజెక్టును కుర్చీ వేసుకొని కూర్చుని చేపిస్తానని చెప్పి ఒక్క పని కూడా కంప్లీట్ చేయలేదని విమర్శించారు.దళితులకి ఇస్తానన్న మూడు ఎకరాల భూమి ఇవ్వలేదని,దళిత ముఖ్యమంత్రిని చేస్తానని మాట తప్పాడని,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఈ మునుగోడు నియోజకవర్గంలో ఒక్క కుటుంబానికి కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు.

బీజేపీ పాలిత రాష్ట్రాలలో నరేంద్ర మోడీ లక్షల సంఖ్యలో ఇళ్లను అర్హులైన పేదలకు కట్టించాడని తెలిపారు.కాలేశ్వరం ప్రాజెక్టులో 70 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని,మిషన్ భగీరథ పేరు మీద నిర్వహించిన పథకం కింద 40వేల కోట్ల కుంభకోణానికి కేసీఆర్ కుటుంబం పాల్పడ్డారన్నారని, కల్వకుంట్ల కుటుంబం మొత్తంగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఆరోపించారు.

తెలంగాణాను మద్యంలో ముంచింది కాకుండా,దేశంలో కూడా ప్రజల్ని మద్యం మత్తులో ముంచడానికి బిఆర్ఎస్ అనీ పార్టీ నాటకం ఆడుతున్నాడని ఎద్దేవా చేశారు.ఎంపీగా రాజగోపాల్ రెడ్డి మాతో పాటుగా పార్లమెంట్లో తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి అని,మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసం తన సొంత ఆస్తులనమ్మి కూడా వారికి కరోనా సమయంలో కావచ్చు,మిగతా సమయాల్లో కూడా సొంత ఖర్చులతో సేవలు చేస్తున్నాడని అన్నారు.

మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఇన్ని రోజులు ఎదురు చూశారని,ఖచ్చితంగా మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి టిఆర్ఎస్ కి బుద్ధి చెప్తారన్నారు.అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్నిక జరుగుతుందా లేదా? కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి జనరల్ ఎలక్షన్ కి వెళ్తారా?అని అనేక ఊహగానాలు వినిపించాయన్నారు.అనుమానాలకు తెరదించుతూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు.ఆనాడు తెలంగాణా ఉద్యమంలో మా శక్తికిమించి కొట్లాడినం, నేను ఎంపీగా ఉండి నాటి మా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రాన్ని సాధించుకున్నామని,నీళ్లు,నిధులు, నియామకాలన్న నినాదంతో ఏర్పడ్డ తెలంగాణా నేడు తలదించుకునేలా కేసీఆర్ కుటుంబం చేసిందన్నారు.

ఒక దుర్మార్గుడి చేతిలో తెలంగాణ బందీ అయిందని వాపోయారు.నేడు రాష్ట్రంలో దసరా పండుగ పూట ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చిందన్నారు.

కేసీఆర్ కుటుంబం ఆయన భజన మండలి లక్షలకోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు.నేడు తెలంగాణలో ఉద్యమకారులకి గౌరవం లేకుండా పోయిందని,ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కనీసం నియోజకవర్గ సమస్యలు చెప్పుకోవడానికి కూడా అనుమతి ఇవ్వని పరిస్థితి నేడు నెలకొందని చెప్పారు.

మునుగోడు నియోజకవర్గ ప్రజలు అందరూ ఒక్కసారి ఆలోచన చేయండి,నేను నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజీనామా చేశాను,నాకు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానిస్తే నా ప్రజలను కూడా అవమానించినట్టే,అలా అనేకమార్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేనైన నాపై వివక్ష చూపాడని,నేడు తెలంగాణా వచ్చిన తరువాత కెసిఆర్ ఆయన కుటుంబంమే బాగుపడిందని,పేద ప్రజల బ్రతుకు మారలేదని అన్నారు.కాబట్టి బీజేపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా ఖచ్చితంగా మునుగోడు ఆత్మగౌరవం నిలబెట్టాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube