మునుగోడుతో కేసీఆర్ పతనం షురూ

నల్లగొండ జిల్లా:కేసీఆర్ సర్కార్ ని గద్దె దించడమే మన లక్ష్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని,మునుగోడు బిజేపి సమరభేరి సభలో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు.మునుగోడు ప్రజలు రాజ్ గోపాల్ రెడ్డిని గెలిపిస్తరా లేదా?రాజ్ గోపాల్ రెడ్డిని గెలిపిద్దాం ఈ గెలుపు ద్వారా కేసీఆర్ పతనానికి నాంది పలుకుదామని పిలుపునిచ్చారు.నల్లగొండ జిల్లా మునుగోడు బీజేపీ సమరభేరి సభలో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ రాజగోపాల్‌రెడ్డి పార్టీలో చేరడం అంటే ఒక నాయకుడు చేరినట్లు కాదు.కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించి సముద్రంలో పారేసేందుకు ఇది ప్రారంభం.

 Kcr's Downfall Started With Munugoda-TeluguStop.com

రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్ ప్రభుత్వం మాయం అవుతుంది.మజ్లిస్‌కు భయపడి విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ జరపడం లేదు.

తెలంగాణలో భాజపా ప్రభుత్వం వచ్చితీరుతుందని ధీమా వ్యక్తంచేశారు.భాజపా ప్రభుత్వం వచ్చాక సెప్టెంబరు 17ను ఉత్సవంగా జరుపుతామని హామీ ఇచ్చారు.

కేంద్రం నిర్మించే మరుగుదొడ్లను కేసీఆర్‌ను అడ్డుకుంటున్నారని,దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారా?తెరాసకు ఓటు వేస్తే ఎన్నిసార్లయినా కేసీఆర్‌ సీఎం అవుతారు తప్ప దళితుడు కాదని అన్నారు.హుజురాబాద్‌లో చెప్పిన దళితబంధు ఎన్ని కుటుంబాలకు ఇచ్చారు.

దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ఇచ్చారా? రైతులను కేసీఆర్‌ తీవ్రంగా మోసం చేస్తున్నారు.పీఎం ఫసల్‌ బీమాను తెలంగాణలో అమలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని అన్నారు.

రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే ప్రతి ధాన్యం గింజను కొంటాం.కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంగా మారిందని ఆరోపించారు.

అన్ని రాష్ట్రాలు రెండుసార్లు పెట్రోల్‌,డీజిల్ ధరలు తగ్గిస్తే కేసీఆర్‌ తగ్గించలేదని, కేసీఆర్ వైఖరి వల్ల దేశంలో పెట్రోల్‌,డీజిల్‌ ధర తెలంగాణలోనే అధికంగా ఉందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube