తెలుగు తిని ప్రేక్షకులకు టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొన్ని వందలాది సినిమాలకు దర్శకత్వం వహించి టాప్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు కే రాఘవేంద్రరావు.
అంతేకాకుండా ఎంతోమంది హీరో హీరోయిన్ లను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా కే రాఘవేంద్రరావుదే అని చెప్పవచ్చు.ఇది ఇలా ఉంటే కె.రాఘవేంద్ర రావు పేరు రాసేటప్పుడు పేరు చివరన బి ఎ అని ట్యాగ్ కనిపిస్తూ ఉంటుంది.అయితే అలా బిఏ అనే ట్యాగ్ ఎందుకు వేస్తారు? అన్నది చాలామంది మదిలో మెదులుతున్న ప్రశ్న.
అయితే ఇదే విషయం పై రాఘవేంద్రరావు వివరణ ఇచ్చారు.ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాఘవేంద్రరావు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.ఈ సందర్భంగా సదురు యాంకర్ ప్రశ్నిస్తూ మీరు డైరెక్టర్ కాకపోతే ఏమి అయ్యేవారు అని అడగగా.నేను డైరెక్ట్ అని కాకపోతే కచ్చితంగా డ్రైవర్ నీ అయ్యవాడిని అని తెలిపారు రాఘవేంద్రరావు.
ఎందుకంటే ఆ సమయంలో నాకు ఏమీ తెలియదు అంతేకాకుండా బిఏ చదువుకున్న వారికి ఏ ఉద్యోగం వస్తుంది డ్రైవర్ కు ఎంత జీతం ఇస్తారు అన్నది కూడా తెలియదు అని చెప్పుకొచ్చారు.

నేను దర్శకుడిగా మారిన తరువాత రెండు మూడు సినిమాలకు చివర్లో బిఏ అని వేసాము ఆ సినిమాలు బాగా సక్సెస్ అయ్యాయి.ఆ తర్వాత ఒక సినిమాలో బిఏ అని వేయడం మానేశాను ఆ సినిమా ఫ్లాప్ అవడంతో, ఆ తర్వాత సినిమా నుంచి బిఏ అన్నది సెంటిమెంట్ గా మారింది అని చెప్పుకొచ్చారు రాఘవేంద్రరావు.అయితే నిజానికి నాకేమీ తెలియదు.
చెక్కులు రాయను.టిక్కెట్లు కూడా కొనుగోలు చేయను.
నా ప్రొడక్షన్ మేనేజర్ లు నా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటు ఉంటారు.నేను బాగా డ్రైవింగ్ చేస్తాను అంటూ దర్శకుడు కాకపోతే డ్రైవర్ అయ్యేవాడిని అన్న విషయాన్ని గుర్తు చేసుకున్నాడు రాఘవేంద్రరావు.