గ్రీన్ టీ.ఇటీవల రోజుల్లో దాదాపు అందరూ దీనిని తమ డైట్ లో ఉండేలా చూసుకుంటున్నారు.
ముఖ్యంగా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారు తప్పకుండా గ్రీన్ టీ ను రెగ్యులర్ గా తీసుకుంటారు.అయితే గ్రీన్ టీ కంటే పైనాపిల్ గ్రీన్ టీ( Pineapple green tea ) తో మరిన్ని ఎక్కువ ఆరోగ్య లాభాలు పొందొచ్చు.
అసలు పైనాపిల్ గ్రీన్ టీ యొక్క ప్రయోజనాలు తెలిస్తే తాగకుండా ఉండలేరు.మరి ఇంకెందుకు ఆలస్యం పైనాపిల్ గ్రీన్ టీను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? మరియు అది అందించే ప్రయోజనాలు ఏంటి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా అరకప్పు పైనాపిల్ ముక్కలను కట్ చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాసుల వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు( Pineapple ), అర అంగుళం దంచిన అల్లం ముక్క, అంగుళం దాల్చిన చెక్క, పావు టేబుల్ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్ వేసి పది నుంచి పన్నెండు నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి టీను ఫిల్టర్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) కలిపి సేవించడమే.ఈ పైనాపిల్ గ్రీన్ టీ ను రెగ్యులర్ గా తీసుకుంటే చాలా వేగంగా బరువు తగ్గుతారు.క్యాలరీలు సూపర్ ఫాస్ట్ గా కరుగుతాయి.
బాన పొట్ట కొద్దిరోజుల్లోనే ఫ్లాట్ గా మారుతుంది.

అంతేకాదు ఈ పైనాపిల్ గ్రీన్ టీ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉంటే దూరం అవుతాయి.రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.కంటి చూపు రెట్టింపు అవుతుంది.
క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.
గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.దంతాలు దృఢంగా మారతాయి.
రక్తపోటు సైతం అదుపులో ఉంటుంది.కాబట్టి ఈ పైనాపిల్ గ్రీన్ టీ ని తప్పకుండా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.







