సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ భీమిరెడ్డి నర్సింహారెడ్డి 14వ,వర్ధంతి సభను జయప్రదం చేయాలని ఎంసిపిఐయు సూర్యాపేట జిల్లా కార్యదర్శి వరికుప్పల వెంకన్న పిలుపునిచ్చారు.ఆదివారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు,మాజీపార్లమెంట్ సభ్యులు, ఎంసిపిఐయు పొలిట్ బ్యూరో సభ్యులు,అమరజీవి కామ్రేడ్ భీమిరెడ్డి నర్సింహారెడ్డి 14వ వర్ధంతి సభ మే 9వ తేదీన అనగా రేపు ఉదయం 10 గంటలకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ రోడ్ లో ఎల్ఐసి ఆఫీస్ దగ్గర బిఎన్ రెడ్డి విగ్రహం వద్ద నిర్వహిస్తున్నామని అన్నారు.
ఆ వర్ధంతి సభకు సూర్యాపేట శాసనసభ్యులు,విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.కావునా ప్రజలు,ప్రజాతంత్ర వాదులు, మేధావులు,ఉద్యోగస్తులు,యువకులు,స్త్రీలు, పురుషులు అధిక సంఖ్యలో హాజరై భీమిరెడ్డి 14 వ, వర్ధంతి సభను జయప్రదం చేయగలరని వెంకన్న పిలుపునిచ్చారు.