సూర్యాపేట జిల్లా: అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని మద్దిరాల ఎస్ఐ మధు నాయుడు హెచ్చరించారు.బుధవారం మద్దిరాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమ రవాణా నివారణకు మద్దిరాల పోలీసులు మరియు రెవెన్యూ మైనింగ్ రవాణా శాఖ సమన్వయంతో పనిచేస్తూ ఇసుక రవాణా నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు.
కొందరు ప్రభుత్వ అనుమతితో రవాణా చేస్తున్నారని, అదికూడా ఎక్కడి వరకు అనుమతి ఉంటే అక్కడికే రవాణా చేయాలని, అనుమతి ఉన్న చోట కాకుండా వేరొక చోటుకు రవాణా చేసినా,మరియు అక్రమంగా ఇసుక డంపు చేసినా కూడా చర్యలు తప్పవన్నారు.ఇసుక రవాణాతో పాటు గ్రామంలో పిడిఎఫ్ బియ్యం,నాటు సారాయి తయారు చేయుటకు ఉపయోగించే బెల్లం తరలిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని మండల ప్రజలను కోరారు.
పోలీసులకు ప్రజల సహాయం సహకారం ఉండాలని ఎవరైనా నిబంధనలు ఉల్లంగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.