సూర్యాపేట జిల్లా:గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరమైన విషయమని, ఏదైనా సమస్య ఉంటే పోరాడి సాధించుకోవాలని,విద్యార్థులు బలమైన మానసిక ధోరణితో ఉండాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ అన్నారు.సోమవారం రాత్రి స్థానిక 60 ఫీట్ల రోడ్డులో గురుకులాల్లో మరణించిన వైష్ణవి,అస్మితలకు కొవ్వొత్తుల ర్యాలీతో నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా సంస్థల్లో కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి,సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనేలా సైకాలజిస్టులతో వారికి శిక్షణ ఇవ్వాలన్నారు.అధికారుల పర్యవేక్షణ నిరంతరం కొనసాగాలని,పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుందన్నారు.
విద్యార్థుల మృతిపై అనేక అనుమానాలు తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారని,వారి ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు.తక్షణ సహాయంగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 50 లక్షల ఎక్స్గ్రేషియా మరియు ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఒకే స్కూల్ కి సంబంధించిన ఇద్దరు విద్యార్థినిలు ఆత్మహత్య చేసుకోవడంతో మిగతా విద్యార్థులు భయాందోళన గురవుతున్నారని,పరీక్షలు దగ్గరలో ఉన్నాయని,వారికి మానసిక ధైర్యాన్ని ఇచ్చి వారి భవిష్యత్తుగా ఆటంకం కలగకుండా చొరవ చూపాలన్నారు.ఈకార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా గర్ల్స్ కన్వీనర్ నందిని,జయంతి, అఖిల,జె.
నరసింహారావు, యాతాకుల ప్రవీణ్,అక్కినపల్లి వినయ్,గోపి,అంజలి,శిరీష, భాగ్య,నిరోష,నవ్య,ప్రియాంక, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.