సూర్యాపేట జిల్లా:ఎన్నికల నిర్వహణ,భద్రతా చర్యల పర్యవేక్షణలో భాగంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే( SP Rahul hegde ) బుధవారం మునగాల పోలీస్ స్టేషన్( Police station ) ను సందర్శించి,ఎన్నికల నిర్వహణకు సంభందించి ప్రణాళికను,ఎన్ఫోర్స్మెంట్ పనులను పరిశీలించారు.పోలీస్ స్టేషన్ పరిధిలో గల కలకోవ,నారాయణపురం, జగన్నాధపురం, నర్సింహులగూడెం, నేలమర్రి గ్రామాల చరిత్రను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మండల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మానిటరింగ్ చేయాలని,సమస్యలను సృష్టించే వారిని ఎన్నికల నియమావ( Election Rules )ళి ప్రకారం ముందస్తు బైండోవర్ చేయాలని,గ్రామాలలో శాంతియుత వాతావరణం ఉండేలా యువతకు, పౌరులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.సమస్యాత్మక గ్రామాల్లో నిత్యం పర్యటిస్తూ పరిస్థితులు అదుపులో ఉంచాలన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థ( Democratic system )లో ఎన్నికల నిర్వహణ అనేది అత్యంత ప్రధాన్యమైనది, ప్రతి ఒక్క పౌరుడు ఎన్నికల ప్రవర్తనా నియమ నిబంధనలకు లోబడి నడుచుకోవాలని,ఎవరైనా అల్లర్లు సృష్టించినా, గొడవలు ప్రేరేపించినా ఎన్నికల నియమావళి ప్రకారం చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కోదాడ డిఎస్పీ ప్రకాష్ జాదవ్,సీఐ వీరరాఘవులు,ఎస్ఐ లోకేష్,సిబ్బంది పాల్గొన్నారు.