పాలపై జీఎస్టీ-మోడీ దిష్టిబొమ్మ దగ్దం

సూర్యాపేట జిల్లా:పసి పిల్లలు తాగే పాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ పేరుతో పన్నులు విధించడం పట్ల సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా పాడి రైతులు ఆందోళనకు దిగారు.వీరికి టీఆర్ఎస్ శ్రేణులు కూడా తోడవడంతో సూర్యాపేట పట్టణంతో పాటు సూర్యాపేట రూరల్,పెన్ పహాడ్,ఆత్మకూర్ (ఎస్),చివ్వెంల మండల కేంద్రాల్లో నిరసనలు హోరెత్తాయి.

 Gst-modi Scarecrow On Milk-TeluguStop.com

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపు మేరకు జీఎస్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు.సూర్యాపేటలో మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ఖాళీ పాల క్యాన్లు,పాడి పశువులతో ర్యాలీ నిర్వహించి ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.

ఈ సందర్బంగా నేతలు మాట్లాడుతూ పాలపై పన్ను విధించిన ఘటన దేశచరిత్రలో ఎన్నడు జరుగలేదన్నారు.బీజేపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పన్నులు విధించడంతో పేద, మధ్యతరగతి వర్గాల బతుకు కష్టంగా మారిందన్నారు.

పాలపై పన్ను విధించడంతో పాడి రైతులందరూ నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు.

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.కేంద్ర ప్రభుత్వం బేషరతుగా పాల ఉత్పత్తులపై జీఎస్టీని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు మంత్రి జగదీశ్ రెడ్డి నాయకత్వంలో పాడి రైతులకు, సామాన్యులకు అండగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube