రాష్ట్రం సిద్దించడానికి దారి చూపింది దొడ్డి కొమురయ్య అమరత్వమే:మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు, తన మరణంతో ప్రజా చైతన్యానికి నాంది పలికిన మహనీయుడు దొడ్డి కొమరయ్య( Doddi Komaraiah ) అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.మంగళవారం దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఘనంగా ఆయన వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు.

 Doddi Komuraya's Immortality Showed The Way To Prepare The State Minister Jagadi-TeluguStop.com

ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యాతిథిగా హాజరై దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం జరిగిన వర్ధంతి సభలో మంత్రి మాట్లాడుతూ…గత ప్రభుత్వాలు ఏనాడు తెలంగాణ త్యాగధనులను స్మరించుకున్న పాపాన పోలేదన్నారు.

తెలంగాణ మహనీయుల చరిత్రను లేకుండా చూడాలని 60 సంవత్సరాలు మన వాళ్ళను మరుగున పడవేశారని,తెలంగాణ సాయుధ పోరాట యోధులను కూడా విస్మరించారని తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్న తర్వాత మహనీయులందరినీ గౌరవించుకుంటున్నామని దీనిలో భాగంగానే దొడ్డి కొమురయ్య వర్ధంతిని అధికారికంగా జరుపుకుంటున్నామని తెలిపారు.కొమురయ్య మరణానికి ఒక ప్రత్యేకత ఉందని,మొదటగా గ్రంథాలయాల ఏర్పాటు ఉద్యమంలా మొదలుపెట్టి, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎదిరించే విధంగా ప్రజలను చైతన్యపరిచారన్నారు.

దొరలు,భూస్వాముల దౌర్జన్యానికి ఎదురు నిలిచి తన ప్రాణాలర్పించారని, తన మరణం తరువాత ఉద్యమకారులు ఆయుధాలు పట్టడం మొదలుపెట్టారని, ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి ధీటుగా మనం కూడా ఆయుధాలు చేపట్టాలని పిలుపునిచ్చి నాయకత్వం వహించింది మన బి.ఎన్.రెడ్డి( BN Reddy ) అని గుర్తు చేశారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కడివెళ్లి గ్రామంలో ఒక సాధారణ కురుమ కులానికి చెందిన గొర్రెల కాపరుల కుటుంబంలో జన్మించిన కొమరయ్య ఒక మహోన్నత ఉద్యమానికి ఆద్యుడు కావడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని అన్నారు.తన19 సంవత్సరాల వయసులోనే దొడ్డి కొమరయ్య భయపడకుండా ప్రజలను సమీకరించి ర్యాలీగా ముందు వరుసలో నడుస్తూ వస్తుండగా జరిపిన కాల్పులలో కొమురయ్య తన ప్రాణాలను విడిచారని అన్నారు.ఆయన స్ఫూర్తితోనే బాంచన్ దోర నుండి ప్రజలు బయటకు వచ్చారని,ఆయన చిందించిన రక్తం వల్లనే తెలంగాణ సిద్ధించిందని అన్నారు.

ఆయనను స్మరించటం,యోధులను తలచుకుంటూ,వారి త్యాగాలను తెలుపుతూ, దొడ్డి కొమరయ్య గురించి భావితరాలకు తెలపాలని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్( Hemanta Keshav ),జడ్పిటిసి జీడి భిక్షం, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, ఇన్చార్జి టీఆర్ఓ రాజేంద్రకుమార్,డిఆర్దిఓ కిరణ్ కుమార్,జడ్పీ సీఈఓ సురేష్ కుమార్, డీఎఫ్ఓ సతీష్ కుమార్, సిపిఓ వెంకటేశ్వర్లు,బీసీ సంఘ నాయకులు వసంత సత్యనారాయణ పిల్లే, జీవన్ కేశవ్,రాపర్తి శీను, వెంకట్,అధికారులు,బీసీ సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube