నూతన సమీకృత కలెక్టరేట్ పనుల్లో వేగం పెంచాలి:ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి

సూర్యాపేట జిల్లా:నూతన సమీకృత కలెక్టరేట్ పనులను పది రోజుల్లో పూర్తి చేయాలని ఆర్ అండ్ బి ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి( Chief Ganapathi Reddy ) సంబంధిత అధికారులు, గుత్తేదార్లను ఆదేశించారు.శనివారం పట్టణంలోని కుడకుడలో నూతన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ తో కలసి ఆయన పరిశీలించారు.

 Speed ​​should Be Increased In New Integrated Collectorate Works Engineer In-TeluguStop.com

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంపౌండ్ వాల్,రోడ్ల పనులు త్వరగా పూర్తి చేయాలని,చుట్టూ గ్రీనరి ఏర్పాటు చేపట్టాలని సూచించారు.అలాగే వాటర్ ఫౌంటేషన్ పనుల గురించి వాకబు చేశారు.

ఎక్కువ సంఖ్యలో వర్కర్లను పెంచి అన్ని పనులను పది రోజుల్లో పూర్తయ్యేలా వేగవంతం చేయాలని,అలాగే పనులలో జాప్యం రాకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఈ నర్సింహ నాయక్,ఈఈ యాకూబ్,గుత్తేదారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube