నూతన సమీకృత కలెక్టరేట్ పనుల్లో వేగం పెంచాలి:ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి

సూర్యాపేట జిల్లా:నూతన సమీకృత కలెక్టరేట్ పనులను పది రోజుల్లో పూర్తి చేయాలని ఆర్ అండ్ బి ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి( Chief Ganapathi Reddy ) సంబంధిత అధికారులు, గుత్తేదార్లను ఆదేశించారు.

శనివారం పట్టణంలోని కుడకుడలో నూతన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ తో కలసి ఆయన పరిశీలించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంపౌండ్ వాల్,రోడ్ల పనులు త్వరగా పూర్తి చేయాలని,చుట్టూ గ్రీనరి ఏర్పాటు చేపట్టాలని సూచించారు.

అలాగే వాటర్ ఫౌంటేషన్ పనుల గురించి వాకబు చేశారు.ఎక్కువ సంఖ్యలో వర్కర్లను పెంచి అన్ని పనులను పది రోజుల్లో పూర్తయ్యేలా వేగవంతం చేయాలని,అలాగే పనులలో జాప్యం రాకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఈ నర్సింహ నాయక్,ఈఈ యాకూబ్,గుత్తేదారులు, సిబ్బంది పాల్గొన్నారు.

నేను, రాజమౌళి సక్సెస్ కావడానికి కీరవాణి కారణం.. కళ్యాణి మాలిక్ కామెంట్స్ వైరల్!