సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ( Suryapet Congress Party )లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి.ఈ మేరకు పటేల్ రమేశ్ రెడ్డి, దామోదర్ రెడ్డి వర్గాల మధ్య వార్ జరిగింది.

అయితే పటేల్ రమేశ్ రెడ్డి, దామోదర్ రెడ్డి మధ్య గతంలో ఎమ్మెల్యే టికెట్ కోసం కోల్డ్ వార్ జరిగింది.తాజాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి రెండు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో రగడ ప్రారంభమైందని తెలుస్తోంది.ఈ సమావేశంలో పటేల్ రమేశ్ రెడ్డి( Patel Ramesh Reddy ) ఫోటో పెట్టలేదంటూ ఆయన వర్గీయులు నిరసనకు దిగారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి ఎదుటే ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.వివాదం తీవ్రరూపం దాల్చడంతో రెండు వర్గాల నేతల మధ్య తోపులాట జరిగింది.
దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.