న్యూస్ రౌండప్ టాప్ 20

1.సిఎల్పీ అత్యవసర భేటీ

Telugu Apcm, Cm Kcr, Corona, Godavari Floods, Komatireddy, Mohan Babu, Sanjay Ra

కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో సీఎల్పీ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. 

2.తెలంగాణ ఏపీ లో వర్షాలు

  తెలంగాణలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.ఎంత బలపడి వాయుగుండం గా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 

3.ఏపీ హైకోర్టు ఆగ్రహం

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com
Telugu Apcm, Cm Kcr, Corona, Godavari Floods, Komatireddy, Mohan Babu, Sanjay Ra

 ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని భవనాలు నిర్మిస్తున్న దారులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

4.విద్యుత్ ఉద్యోగుల ధర్నా

  తెలంగాణ విద్యుత్ సౌదా వద్ద విద్యుత్ ఉద్యోగులు మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.విద్యుత్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఈ నిరసన దీక్షకు దిగారు. 

5.పెరుగుతున్న వరద ఉధృతి

Telugu Apcm, Cm Kcr, Corona, Godavari Floods, Komatireddy, Mohan Babu, Sanjay Ra

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతోంది.పుష్కర్ ఘాట్ వద్ద 10.290 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. 

6.చేనేత వస్త్రాలపై జీఎస్టీ ఎత్తివేయాలి

  చేనేత వస్త్రాల పై జీఎస్టీ ఎత్తివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. 

7.దుర్గ గుడి ఘాట్ రోడ్ మూసివేత

Telugu Apcm, Cm Kcr, Corona, Godavari Floods, Komatireddy, Mohan Babu, Sanjay Ra

దుర్గ గుడి ఘాట్ రోడ్ ను అధికారులు మూసివేశారు.వర్షాలు కురుస్తుండడంతో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని భావించి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

8.మోడీపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు

  ప్రధాని నరేంద్ర మోడీపై జనసేన పవన్ కళ్యాణ్ ప్రశంసలు వర్షం కురిపించారు.కామన్ వెల్త్ క్రీడ పోటీలు మహిళల కుస్తీ పోటీల్లో స్వర్ణం చేజారినందుకు భారత ప్రజలకు క్షమాపణలు చెప్పిన పూజ గెహ్లాడ్ ను ప్రధాని ఓదార్చిన తీరును పవన్ అభినందించారు. 

9.రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందే : జగన్

Telugu Apcm, Cm Kcr, Corona, Godavari Floods, Komatireddy, Mohan Babu, Sanjay Ra

రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందే అని వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 

10.ఏపీ ప్రభుత్వంపై సిపిఐ విమర్శలు

  ప్రధా బాధితులను ఆదుకోవడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. 

11.ముద్రగడ బహిరంగ లేఖ

Telugu Apcm, Cm Kcr, Corona, Godavari Floods, Komatireddy, Mohan Babu, Sanjay Ra

అంబేద్కర్ కోనసీమ జిల్లా వివాదంపై మాజీ మంత్రి కాపు ఉద్యమ మాజీ నేత ముద్రగడ పద్మనాభం ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. 

12.భారత్ లో కరోనా

  గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 16,167 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 

13.గవర్నర్ తో షర్మిల భేటీ

Telugu Apcm, Cm Kcr, Corona, Godavari Floods, Komatireddy, Mohan Babu, Sanjay Ra

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నేడు తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ తో భేటీ కానున్నారు. 

14.  మోహన్ బాబు ఆధ్వర్యంలో సాయిబాబా విగ్రహావిష్కరణ

  ఈనెల 11వ తేదీన తిరుపతిలో సినీ నటుడు మోహన్ బాబు ఆధ్వర్యంలో సాయిబాబా విగ్రహావిష్కరణ జరగనుంది. 

15.రొట్టెల పండుగ

Telugu Apcm, Cm Kcr, Corona, Godavari Floods, Komatireddy, Mohan Babu, Sanjay Ra

నెల్లూరు లో రొట్ల పండుగ ఏర్పాట్ల పై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.  16.స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు   నుంచి తెలంగాణలో స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను నిర్వహించనున్నారు.దీనిని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. 

17.జుడిష్యియల్ కష్టడికి ఎంపీ సంజయ్ రౌత్

Telugu Apcm, Cm Kcr, Corona, Godavari Floods, Komatireddy, Mohan Babu, Sanjay Ra

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు ఈ నెల 22 వరకు  జుడిష్యియల్  కస్టడీ విధించారు. 

18.మహారాష్ట్ర క్యాబినెట్ విస్తరణ

  ఆగస్టు 15న మహారాష్ట్ర క్యాబినెట్ ను విస్తరించనున్నారు. 

19.దేవాలయంలో తొక్కిసలాట : ముగ్గురు మృతి

రాజస్థాన్ లోని శిఖర్ జిల్లాలోని ఖ్యాతు శ్యామ్ జి దేవాలయంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు మృతి చెందారు. 

20.ఈ రోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,550
  24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 51,870

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube