సర్పంచ్ ఎన్నికల్లో గ్రామీణ యువత పోటీ చేయాలి...!

సూర్యాపేట జిల్లా: త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీకి ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువత ముందుకు రావాలని,మీ నామినేషన్ కు అయ్యే ఖర్చును నేను భరిస్తానని తెలంగాణ ఉద్యమకారుడు బెల్లంకొండ నవీన్ పిలుపునిచ్చారు.రాజకీయ పార్టీల నాయకులు మద్యం, నోట్ల కట్టలు చూపించి యువతను రాజకీయ బానిసలుగా చేసి,వారితో జెండాలు మోపిస్తూ,జేజేలు కొట్టించుకొని రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారన్నారు.

 Rural Youth Should Contest In Sarpanch Elections, Rural Youth , Sarpanch Electio-TeluguStop.com

సూర్యాపేట జిల్లా నడిగుడెం మండలం బృందావనపురం గ్రామ పంచాయితీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేయడానికి యువత ముందుకు వస్తే ఐదుగురి అభ్యర్ధుల నామినేషన్ ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చారు.ఒకప్పుడు కాలేజీ స్థాయి, యూనివర్సిటీ స్థాయిలో విద్యార్థులకు ఎలక్షన్ ఉండేవని,దాంతో రాజకీయాలపై యువతకు ఒక అవగాహన ఉండేదని, రానురాను నేటి యువత ఎలక్షన్స్ పై ఆసక్తి చూపించకపోవడం బాధాకరమన్నారు.

ఏరులై పారుతున్న మద్యం,నోట్ల కట్టలు,సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు విచ్చలవిడిగా చేస్తున డబ్బు ఖర్చుకు అడ్డుకట్ట వేయడానికి యువ ఓటర్లకు అవగాహన కల్పించాలని అధికారులను కోరారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube