సర్పంచ్ ఎన్నికల్లో గ్రామీణ యువత పోటీ చేయాలి…!

సూర్యాపేట జిల్లా: త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీకి ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువత ముందుకు రావాలని,మీ నామినేషన్ కు అయ్యే ఖర్చును నేను భరిస్తానని తెలంగాణ ఉద్యమకారుడు బెల్లంకొండ నవీన్ పిలుపునిచ్చారు.

రాజకీయ పార్టీల నాయకులు మద్యం, నోట్ల కట్టలు చూపించి యువతను రాజకీయ బానిసలుగా చేసి,వారితో జెండాలు మోపిస్తూ,జేజేలు కొట్టించుకొని రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారన్నారు.

సూర్యాపేట జిల్లా నడిగుడెం మండలం బృందావనపురం గ్రామ పంచాయితీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేయడానికి యువత ముందుకు వస్తే ఐదుగురి అభ్యర్ధుల నామినేషన్ ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చారు.

ఒకప్పుడు కాలేజీ స్థాయి, యూనివర్సిటీ స్థాయిలో విద్యార్థులకు ఎలక్షన్ ఉండేవని,దాంతో రాజకీయాలపై యువతకు ఒక అవగాహన ఉండేదని, రానురాను నేటి యువత ఎలక్షన్స్ పై ఆసక్తి చూపించకపోవడం బాధాకరమన్నారు.

ఏరులై పారుతున్న మద్యం,నోట్ల కట్టలు,సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు విచ్చలవిడిగా చేస్తున డబ్బు ఖర్చుకు అడ్డుకట్ట వేయడానికి యువ ఓటర్లకు అవగాహన కల్పించాలని అధికారులను కోరారు.

ఇప్పటికైనా రోటీన్ సినిమాలను చేయడం ఆపకపోతే తెలుగు ఇండస్ట్రీ పరువు పోతుందా..?