విద్యుత్ ను ప్రైవేటీకరణ చేయడమంటే దేశ ప్రజలకు ద్రోహం చేయడమే:మంత్రి

సూర్యాపేట జిల్లా:విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడమంటే అది దేశ ప్రజలకు ద్రోహం చేయడమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు.సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణకు కేంద్రం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.

 Privatization Of Electricity Is A Betrayal Of The People Of The Country: Ministe-TeluguStop.com

విద్యుత్ రంగ ప్రైవేటీకరణ దేశ ప్రజలకు చేటని, విద్యుత్ సంస్కరణలు దేశ ప్రజలకు ఊరి తాళ్ళుగా మారబోతున్నాయని,సంస్కరణల పేరుతో ప్రజల జేబులు కొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్నాళ్ళ క్రితం చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయని,ప్రైవేట్ వ్యక్తుల చేతికో,సంస్థల చేతికో డిస్కంలు వెళితే నిత్యావసర ధరల పెరగుదలకు అడ్డూ అదుపు లేకుండా పోతుందన్నారు.

దీని ఎఫెక్ట్ దేశంలోని రైతాంగం,గృహ వినియోగదారులపై తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.దీనికి వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు,దేశంలోని ప్రగతిశీల సంఘాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube