యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతించే విషయంలో తానేమీ చేయలేనని ఆలేరు అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విఫ్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి చేతులెత్తేశారు.బుధవారం యాదాద్రి కొండపైకి నిషేధానికి గురైన ఆటో డ్రైవర్లు ఎమ్మెల్యేను కలిసి తమ గత సంవత్సర కాలంగా గుట్టపైకి ఆటోలు నడవక అనేక ఇబ్బందులు పడుతున్నామని తమ సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకోగా తాను అన్ని ప్రయత్నాలు చేశానని,ఇక ఈ విషయంలో నేనేమీ చేయలేనని చేతులెత్తేసి వెళ్ళిపోయారు.
అనంతరం ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ యాదగిరిగుట్టపైకి ఆటోలను అనుమతించాలని సంవత్సరం నుండి ఆందోళన చేస్తున్నా అనుమతించడం లేదని వాపోయారు.దీనితో కుటుంబాలు గడవక ఆటో డ్రైవర్లు వీధిన పడ్డామని అవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పెద్దలు తమ పరిస్థితిని అర్దం చేసుకొని గుట్టపైకి ఆటోలను అనుమతించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.