ఏసీబీ వలలో అవినీతి చేప - 13000 తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

రాజన్న సిరిసిల్ల జిల్లా: అవినీతి నిరోధక శాఖ అధికారులకు అవినీతి చేప చిక్కింది.సిరిసిల్ల సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఉపేందర్ రావు జిల్లాలోని వీర్నపల్లి మండలం అడవి పదిర గ్రామానికి చెందిన భూక్యా సరిత టిప్పర్ సబ్సిడీ కోసం కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ హైదరాబాద్ కు దరఖాస్తు చేసుకోగా.అప్లికేషన్ సరితకు అనుకూలంగా పంపడానికి 30 వేల రూపాయల లంచం అడిగారు.

 Officers Caught While Taking 13000 Corruption In Rajanna Sircilla, Acb Officers-TeluguStop.com

17వేల రూపాయలు ఈనెల 26న తీసుకోగా, సోమవారం మిగతా 13000 సరిత మరిది భూక్య శివకుమార్ వద్ద పట్టణంలోని జెడ్పీ హై స్కూల్ గితానగర్ లో తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.కేసు నమోదు చేసి, నిందితున్ని ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ డిఎస్పి వి.వి రమణమూర్తి తెలిపారు.ఏ అధికారైన అవినీతికి పాల్పడితే 9154388954 సంప్రదించాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube