తంగళ్ళపల్లి, నేరెళ్ళ లోని ఆరోగ్య మహిళా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్..

తంగళ్ళపల్లి: “ఆరోగ్య మహిళా”కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం, ఆవశ్యకత గురించి ప్రతీ మహిళకు అవగాహన కల్పించాలని, ఇందులో ఏఎన్ఎం లు, ఆశా కార్యకర్తలు ప్రధాన పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.మంగళవారం తంగళ్ళపల్లి, నేరెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళా కేంద్రాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి, మహిళలకు అందిస్తున్న వైద్య సేవలు, నిర్ధారణ పరీక్షలు చేస్తున్న తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

 District Collector Inspected The Womens Health Centers In Tangallapally And Nere-TeluguStop.com

ముందుగా రిజిస్ట్రేషన్, పారమీటర్ల పరిశీలన, ఆన్ లైన్ లో డాటా ఎంట్రీ, నిర్ధారణ పరీక్షల నిర్వహణ, తదితర వాటి గురించి ఆరా తీసి, వైద్య పరీక్షల కోసం వచ్చిన మహిళలను కలెక్టర్ పలకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆనారోగ్యం బారిన పడకుండా, ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆరోగ్య మహిళా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతీ మంగళవారం ఆరోగ్య మహిళా కేంద్రాల్లో మహిళలకు పోషకాహార లోపం, బ్రెస్ట్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, తదితర వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడంతో పాటు, అవసరమైతే జిల్లా ఆసుపత్రికి పంపించి చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు.జిల్లాలో 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీఎస్ నగర్, తంగళ్ళపల్లి, నేరెళ్ళ, వేములవాడ) ఆరోగ్య మహిళా కార్యక్రమం ప్రతీ మంగళవారం నిర్వహిస్తున్నామని అన్నారు.

Telugu Latest, Rajannasircilla, Sudheer, Telugudistricts-Rajanna Sircilla

ఎనిమిది టెస్టులను అందరికీ తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు.పరీక్షల వివరాలను ఆన్ లైన్ లో పకడ్బందీగా ఎంట్రీ చేయాలని ఏఎన్ఎం లను ఆదేశించారు.ఈ విధానాన్ని మెడికల్ ఆఫీసర్లు పర్యవేక్షించాలని సూచించారు.నిర్ధారణ పరీక్షల్లో ఎవరికైనా వ్యాధి ఉన్నట్లు తెలిస్తే, మెరుగైన చికిత్స కోసం వారిని జిల్లా ఆసుపత్రికి పంపించాలని అన్నారు.

వారు ఆసుపత్రికి వెళ్ళి చికిత్స తీసుకున్నారా లేదా అనే విషయాన్ని సంబంధిత ఆశా, ఏఎన్ఎం లు పర్యవేక్షించాలని సూచించారు.

ఈ కార్యక్రమాన్ని తమ పరిధిలోని మహిళలందరూ వినియోగించుకునేలా సంబంధిత ఆశా,ఏఎన్ఎం లు క్షేత్ర స్థాయిలో విస్తృత ప్రచారం, అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట ఉప వైద్యాధికారులు డా.శ్రీరాములు, డా.రజిత, మెడికల్ ఆఫీసర్లు డా.స్నేహ, డా.రేఖ, ఏఎన్ఎం లు, సూపర్వైజర్లు, తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube