రాజమౌళి బాహుబలి తెరకెక్కించిన తర్వాత ఇక సౌత్ ఇండస్ట్రీ నుంచి ఇంతకుమించిన సినిమా రాదు అని అనుకున్నారు అందరు.ఒక సాదాసీదా సినిమా గా వచ్చి అంతకు మించిన విజయాన్ని సాధించింది కేజిఎఫ్ సినిమా.
అన్ని భాషలలో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.ప్రతి పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమాకి సీక్వెల్ కూడా తీశారు.
ఇటీవలే కే జి ఎఫ్ చాప్టర్ 2 కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఇప్పుడు థియేటర్ల వద్ద గర్జిస్తూ కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తుంది కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా.
విడుదలైన మొదటి రోజు 130 కోట్ల కలెక్షన్లు సాధించి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
ఇక బాలీవుడ్లో సైతం సత్తా చాటుతూ సౌత్ హవా నడిపిస్తుంది.కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా ప్రశాంత్ నీల్ టేకింగ్ సినీ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా జేజేలు కొడుతూ ఫిదా అయిపోతున్నారు అని చెప్పాలి.ఇక కే జి ఎఫ్ చాప్టర్ 3 కూడా ఉండబోతుంది అని చిన్న హింట్ బయటకు రావడంతో అభిమానులు అందరూ ఆనందంతో ఎగిరి గంతేస్తున్నారు.
అయితే సినిమాకి ప్రశాంత్ నీల్ టేకింగ్ శరీరం లాంటిది అయితే అటు సంగీత దర్శకుడు రవి బస్సుర్ అందించిన సంగీతం ప్రాణం పోసింది అని చెప్పాలి కే జి ఎఫ్ లో యాక్షన్ సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందరిని మంత్రముగ్ధులను చేసింది అనే చెప్పాలి.దీంతో రవి బస్సుర్ అందించిన సంగీతం పై ప్రస్తుతం ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే సంగీత దర్శకుడు రవి బస్సురు గురించి ఒక వార్త మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.లాక్ డౌన్ సమయంలో రవి బస్సుర్ తన సొంత ఊరు ఉడిపిలోని కుందాపూర్ వెళ్లి అక్కడ తండ్రితోపాటు దేవుళ్లకు ఆభరణాలు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.ఇక ఇందుకుగాను అతనికి రోజుకి ముప్పై ఐదు రూపాయల సంపాదన వచ్చేదట.ఇక కేజిఎఫ్ లాంటి సినిమాకు సంగీతం అందించి కోట్ల రెమ్యునరేషన్ అందుకున్న ఈ సంగీత దర్శకుడు ఇక తండ్రికి సహాయపడుతూ 35 రూపాయలు అందుకోవడంలో కూడా ఆనందాన్ని వెతుక్కున్నాడు అని చెప్పాలి.
ఈ విషయం తెలిసి అభిమానులు ఆయన సింప్లిసిటీ కి ఫిదా అయిపోతున్నారు
.