కేజిఎఫ్ 2 పై రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వైల్డ్ మెన్ అంటూ..

కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ తో ఏ రేంజ్ హిట్ అందుకున్నాడో అందరికి తెలుసు.కెజిఎఫ్ చాప్టర్ 1 భారీ హిట్ అందుకోవడంతో చాప్టర్ 2 స్టార్ట్ చేసి షూటింగ్ కూడా పూర్తి చేసి విడుదల కూడా చేసారు.

 Rana Daggubati Heaps Praise On Kgf 2 Details, Yash , Kgf Chapter 2 , Prashant Ne-TeluguStop.com

రెండేళ్ల నుండి ఈ సినిమా కోసం సౌత్ ఇండియా మాత్రమే కాదు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఎదురు చూసారు.ఇంకా ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా పెరిగాయి.

ఈ నెల 14న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.

రిలీజ్ అయిన అన్ని చోట్ల ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగి పోయింది.

దీంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.ఈ సినిమాలో యష్ యాక్టింగ్ తో మరోసారి దుమ్ము లేపేసాడు.అలాగే ప్రశాంత్ నీల్ తన డైరెక్షన్ తో అదర గొట్టాడనే చెప్పాలి.దీంతో ఏ ఇండస్ట్రీలో చుసిన ఈ సినిమా గురించే టాక్ వినిపిస్తుంది.

ఒక్క సినిమాతో యష్ కన్నడ నాట సంచలనం సృష్టించాడు.రాఖీ బాయ్ గా ఈయన సృష్టించిన వీరంగం గురించి అందరికి తెలుసు.

Telugu Rana Daggubati, Yash, Kgf, Kgf Chapter, Prashant Neil, Rana Kgf, Sai Pall

ఇక ఇప్పుడు చాప్టర్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి రికార్డులను కొల్లగొట్టాడు.ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధించడంతో సెలెబ్రిటీలు సైతం విషెష్ చెబుతున్నారు.టీమ్ తాము పడిన కష్టానికి ఇంతటి రెస్పాన్స్ రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Rana Daggubati, Yash, Kgf, Kgf Chapter, Prashant Neil, Rana Kgf, Sai Pall

తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కామెంట్స్ చేసాడు.ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.ఈయన పోస్ట్ చేస్తూ.”వైల్డ్ వైల్డ్ మెన్ మీరు మళ్ళీ అద్భుతం చేసారు.యష్, ప్రశాంత్ నీల్ బాగా చేశారు.

కేజిఎఫ్ టీమ్ అందరికి అభినందనలు” అంటూ ఈయన చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది.ఇక రానా సినిమాల విషయానికి వస్తే ఈయన నటించిన విరాటపర్వం సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.

అందులో సాయి పల్లవి రానా కు జోడీగా నటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube