ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ముక్కు అవినాష్ తన కామెడీతో ప్రేక్షకులను అలరించి కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ముక్కు అవినాష్ తన కామెడీ ద్వారా ప్రేక్షకులను నవ్వించి వారి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.
జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న అవినాష్ ఇంత కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి సొంత ఇంటిని నిర్మించుకున్నాడు.కొన్ని నెలల క్రితం అవినాష్ పెళ్లి చేసుకొని భార్యతో సంతోషంగా జీవనం సాగిస్తున్నాడు.
ఒకానొక సమయంలో అవినాష్ ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.కష్టపడి సొంత ఇంటిని నిర్మించుకున్న తర్వాత అతని తల్లిదండ్రులు ఒక్కసారిగా అనారోగ్యం పాలవడంతో ఎంతో కష్టపడి వారికి వైద్యం చేయించాడు.
ఆ సమయంలో చేతిలో రూపాయి లేకపోవడంతో అయిన వారి నుండి సాయం కోసం ఎదురుచూసిన కూడా ఎటువంటి ఫలితం లేకపోయింది.పైగా అదేసమయంలో కరోనా లాక్డౌన్ కారణంగా టీవీ షో లు లేకపోవటం తో ఆర్థిక ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి.

కష్ట సమయంలో ఆప్తుల నుండి సాయం ఆశించి ఫలితం లేకపోవడంతో జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.ఆ తర్వాత మాటీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో లో పాటిస్పేట్ చేసి అక్కడ కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఆ సమయంలో జబర్దస్త్ యాజమాన్యానికి 10 లక్షల రూపాయలు డబ్బులు చెల్లించి మరీ బిగ్ బాస్ షో లో పాటిస్పేట్ చేశాడు.అవినాష్ పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్యతో కలిసి ఇటీవల మాటీవీలో ప్రసారం అవుతున్న ఇస్మార్ట్ జోడి2 లో పార్టిసిపెట్ చేస్తున్నాడు.
ఇటీవల ఈ షోలో ఓంకార్ అవినాష్ గురించి మాట్లాడుతూ ఎంతో కష్టపడి ఇప్పుడు ఇంత మంచి స్థాయికి వచ్చినందుకు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని ప్రశంసించాడు.







