చెరువు మత్తడికి మరమ్మత్తులు చేపట్టాలి : డి ఈ కి వినతి పత్రం అందజేసిన రైతులు.

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలోని వీరసముద్రం చెరువు మత్తడికి బుంగలు పడి నీరు వృధాగా పోవడంతో మరమ్మత్తులు( Pond Dam Repairs ) చేపట్టాలని రైతులు డీఈకి వినతి పత్రం అందజేశారు.చెరువు ఆయకట్టు రైతులు మాట్లాడుతూ ఇటీవల అధిక వర్షాలు కురవడంతో చెరువు పూర్తిగా నిండి ఉంది.

 Farmers Submitted A Petition To De About Pond Dam Repairs,pond Dam Repairs,farme-TeluguStop.com

అయితే చెరువు మత్తడి కింద దాదాపు ఆరు నుండి పది వరకు బుంగలు ఉండటం వలన దాదాపు రెండు మూడు ఇంచుల నీరు వృధాగా పోవుచున్నదని పేర్కొన్నారు.ఈ కారణంగా  యాసంగి పంటకు వ్యవసాయ బావులలో నీటి ఎద్దడి ఏర్పడుతుందని తెలిపారు.

కావున ఈ నీటి ఎద్దడిని తప్పించే విధంగా చెరువు మొత్తానికి తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టి రానున్న వేసవికాలంలో శాశ్వత పరిష్కారం చేయవలసిందిగా డిఈ9 DE )ని కోరినట్లు వెల్లడించారు.ఫిబ్రవరి నెలలో ముస్తాబాద్( Mustabad 0 పెద్ద చెరువు నీళ్లను పిల్ల కాలువ ద్వారా వీర సముద్రం చెరువుకు నీటిని విడుదల చేసి చెరువు కింద చెరువు నింపవలసిందిగా  నీటి పారుదల డిఈకి వినతిపత్రం అందజేశామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో రాములు,నగేష్ మల్లయ్య, నాంపల్లి, తుక్కయ్య దేవయ్య,చంద్రయ్య,భూదయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube