రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే, సబ్బండ వర్గాలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ( Congress party )యే నని గంభీరావుపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్ అన్నారు.శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ మాట్లాడుతూ 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను, 1200 వందల మంది విద్యార్థి అమరవీరుల త్యాగాలను గుర్తించిన ఆనాటి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం అని భావించి ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేర్చి ఎన్ని ఇబ్బందులు వచ్చినా రాజకీయంగా రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ నష్టపోయినప్పటికిని ఇచ్చిన మాట కోసం మాట తప్పకుండా మడమ తిప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తల్లి సోనియా గాంధీ అని కొనియాడారు.ఎవరు ఏమన్నా తెలంగాణ రాష్ట్రానికి ముమ్మాటికి సోనియా గాంధీ( Sonia Gandhi ) తెలంగాణ తల్లి అని అభివర్ణించారు.
వచ్చిన తెలంగాణలో అమలు కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను నయవంచన చేసి మరి ముఖ్యంగా విద్యార్థి, నిరుద్యోగుల ఆకాంక్షలను తొక్కిపెట్టి ఈరోజు నిరంకుశ నియంతృత్వ కుటుంబ పాలనను కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీశారని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం వస్తే మన నీళ్లు మనకు మన నిధులు మనకు మన నియామకాలు మనకు వస్తాయని ఆశించిన తెలంగాణ ప్రజలకు భంగపాటు కలిగిందని, నీళ్లు గజ్వేల్ ఫామ్ హౌస్ కు నిధులు సిద్దిపేటకు నియామకాలు కేసీఆర్ కుటుంబానికి వచ్చాయని అన్నారు.
తెలంగాణ ప్రజలను మోసం చేసిన కెసిఆర్ ను తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని( Telangana state ) ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞత భావం తెలుపడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కంకణం కట్టుకున్నారని రానున్న రోజుల్లో రాబోయే ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ఆకాంక్షించే కాంగ్రెస్ ప్రభుత్వమని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ ఆత్మగౌరవం గడిలలో బందీ అయిన తెలంగాణ తల్లిని విముక్తి చేయడానికి ప్రజా రంజక పాలనను అందిస్తుందని అన్నారు.రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తప్పకుండ సబ్బండవర్ణాలకు న్యాయం జరుగుతుందని అన్నారు.
ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ తల్లి సోనియా గాంధీ కి యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజల నుండి ముఖ్యంగా గంభీరావుపేట( GAMBHIRAOPET ) మండల ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లచ్చయ్య,ఈడపోయిన ప్రభాకర్,మహమ్మద్ యాదుల్లా, రామచంద్రారెడ్డి, జంగం రాజు, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు పాపా గారి రాజు గౌడ్,మేడా భాస్కర్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గంగి స్వామి తదితరులు పాల్గొన్నారు
.