17వ పోలీస్ బెటాలియన్ లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా అర్బన్ పరిధిలోని సర్దాపూర్ నందు గల 17వ పోలీస్ బెటాలియన్ లో  బెటాలియన్ కమాండెంట్ కె.సుబ్రమణ్యం జాతీయ జెండా ఎగురవేసి పోలీస్ అధికారులకు,పోలీస్ సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

 Telangana Formation Day Celebrations In 17th Police Battalion, Telangana Formati-TeluguStop.com

ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ మాట్లాడుతూ ఈసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ప్రత్యేకమైనదని,ఇది 10వ తెలంగాణ వార్షికోత్సవం అని…తెలంగాణ ప్రజలు కన్న కలలు సాకారం అయిన రోజు అని.బెటాలియన్ అభివృద్ధికై సిబ్బంది ప్రతి ఒక్కరు తమ వంతుగా కృషి చేయాలని కోరారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సిబ్బంది ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మెక్క నాటాలని… ”చెట్టు ప్రగతికి మెట్టు” అని ఈ మొక్కలు పచ్చని ప్రకృతికి కారణం అవుతాయని, భావితరాలకు ఉపయోగకరమని అన్నారు.అలాగే విధి నిర్వహణలో భాగంగా పోలీసు శాఖలో సమర్థవంతంగా విధులు నిర్వహించి, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విజయ్ శంకర్ పాండే, ఆర్.ఎస్.ఐ అతి-ఉత్కృష్ట సేవా పథకం , ఎం.ఆంజనేయులు ఏ ఆర్ ఎస్ ఐ -86,ఉత్కృష్ట సేవా పథకం ఇద్దరు సిబ్బందికి పథకాలు అందజేశారు.ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎలాంటి రిమార్కులు లేకుండా పథకాలు స్వీకరించడం ఆనందదాయకమని,

Telugu Rajannasircilla, Sudheer, Telugudistricts-Telugu Districts

ఇదే స్ఫూర్తితో విధుల పట్ల అంకితభావం, ఉత్తమ ప్రతిభ కనబరిచి పేరు ప్రతిష్టలు సంపాదించాలని కమాండెంట్ సూచించారు.అనంతరం బెటాలియన్ సిబ్బంది, అధికారులు ఖాళీ సమయంలో ఆటవిడుపు కొరకై నూతనంగా నిర్మించినబడినటువంటి షటిల్ కోర్ట్ ,వాలీబాల్ కోర్ట్ లను, సిబ్బంది తాగునీటి అవసరాలు తీర్చడానికి 80లీటర్ల వాటర్ కూలర్ ను బెటాలియన్ కమాండెంట్ కె.సుబ్రమణ్యం, ఏ.ఓ బి.శైలజ తో కలిసి ప్రారంభించడం జరిగింది.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలను జూన్ 22 వరకు చేపట్టబోతున్నామని ఈ సందర్భంగా కమాండెంట్ తెలిపారు…ఈ కార్యక్రమంలో ఏ.ఓ శ్రీమతి బి.శైలజ, అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube