ఈ హోమ్ మేడ్ ఫేస్ క్రీమ్ ను వాడితే స్పాట్ లెస్ అండ్ షైనీ స్కిన్ మీ సొంతం!

ముఖంపై ఏర్పడే ముదురు రంగు మచ్చలు అందాన్ని పాడుచేస్తాయి.మనలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి.

 If You Use This Homemade Face Cream, You Will Get Spotless And Shiny Skin! Spotl-TeluguStop.com

మనశ్శాంతిని దూరం చేస్తాయి.ఈ క్రమంలోనే మచ్చలను పోగొట్టుకునేందుకు తెగ‌ ప్రయత్నిస్తూ ఉంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ క్రీమ్ మీకు చాలా బాగా సహాయపడుతుంది.రెగ్యులర్ గా ఈ క్రీమ్ ను కనుక వాడితే స్పాట్ లెస్ అండ్ షైనీ స్కిన్( Spotless and shiny skin ) మీ సొంతం అవుతుంది.మరి లేటెందుకు క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Tips, Face Cream, Homemadeface, Latest, Shiny Skin, Skin Care, Skin Care

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax seeds ), వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee powder ) వేసి బాగా కలిపి ఉడికించాలి.దాదాపు 15 నిమిషాల పాటు ఉడికిస్తే వాటర్ జెల్లీ స్ట్రక్చర్ ( Water jelly structure )లోకి మారుతుంది.అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

పూర్తిగా కూల్ అయ్యాక ఈ జెల్ ను మిక్సీ జార్ లో వేసుకోవాలి.

Telugu Tips, Face Cream, Homemadeface, Latest, Shiny Skin, Skin Care, Skin Care

అలాగే వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ), హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేస్తే మన క్రీమ్ అనేది రెడీ అవుతుంది.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ఫేస్ వాష్ చేసుకుని ఆపై తయారు చేసుకున్న క్రీమ్ ముఖానికి మెడకు అప్లై చేసుకోవాలి.

ప్రతిరోజు ఈ హోమ్ మేడ్ క్రీమ్‌ ను కనుక వాడితే ముఖంపై ఎలాంటి ముదురు రంగు మచ్చలు ఉన్న తగ్గుముఖం పడతాయి.స్కిన్ టైట్ గా మారుతుంది.

ముడతలు దూరం అవుతాయి.స్పాట్ లెస్ అండ్ షైనీ స్కిన్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube