వేములవాడ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.,

Special Measures For Traffic Control In Vemulawada Town District SP Akhil Mahajan , District SP Akhil Mahajan, Vemulawada, DSP Nagendrachari, CI Venkatesh

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ( Vemulawada ) రాజన్న దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తుల, వాహనాలు వేములవాడకి వస్తుంటాయని, వాటిని దృష్టిలో ఉంచుకోని ట్రాఫిక్ అంతరాయం కల్గకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాళ్ళన్నారు.ఈ రోజు వేములవాడ పట్టణంలో డిఎస్పీ నాగేంద్రచారి,సి.

 Special Measures For Traffic Control In Vemulawada Town District Sp Akhil Mahaja-TeluguStop.com

ఐ వెంకటేష్ తో ప్రధాన కూడళ్లు కలియ తిరుగుతూ ట్రాఫిక్ క్రమబద్ధీకారణతో వాహనదారులకు,పాదచారులకు,రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలతో పాటు,ట్రాఫిక్ అధికారులు నిర్వర్తిచాల్సిన విధుల పట్ల పలు సూచనలు చేశారు.ఆటో డ్రైవర్లతో మాట్లాడుతూ క్రమశిక్షణతో ,రోడ్ భద్రత నియమాలను పాటిస్తూ వాహనాలు నడపాలని, ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వాములు కావాలన్నారు.

రాత్రి సమయాల్లో అనుమానిత వ్యక్తులు కపడితే పోలీస్ వారికి లేదా డయల్ 100 కి కాల్ చేసి సమాచారం అందివ్వాలన్నారు.రాజన్న దర్శనానికి అనునిత్యం వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు వస్తారని వారితో మర్యాదగా నడుచుకోవాలని అన్నారు.

ఆటోలో పరిమితి వరకే ప్రజలను ఎక్కించుకోవాని పరిమితి మించి ఎక్కించుకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అన్నారు.అనంతరం వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి సిబ్బంది తో మాట్లాడుతూ ప్రజల సమస్యలను తీర్చడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలన్నారు.

స్టేషన్ పరిధిలో బ్లూ కోల్ట్ ,పెట్రో కార్ సిబ్బంది విధిగా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని, డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24×7 గస్తీ నిర్వహించాలన్నారు.రౌడీలు, కెడిలు,సస్పెక్ట్స్ మరియు సంఘ విద్రోహ శక్తుల మీద నిరంతరం నిఘా ఉంచాలన్నారు.

ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ వెంకటేష్, బన్సీలాల్, ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube