రాగుల రాములుకు సంబంధించిన బాధితులు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలి - డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా: అవసరానికి డబ్బులు ఇచ్చి ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకొని, అదే ఇంటిని బ్యాంకులో పెట్టి 20 లక్షల రూపాయల రుణం తీసుకొని,ఇచ్చిన డబ్బులు కట్టిన తర్వాత ఇంటిని రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేసిన రాగుల రాములు పై సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్టు డిఎస్పీ తెలిపారు.ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ…సిరిసిల్ల పట్టణ పరిధిలోని సంజీవయ్య నగర్ కి చెందిన రాకం పెద్ద బాబు అనే వ్యక్తి తన అవసరం నిమిత్తం సిరిసిల్ల పట్టణానికి చెందిన రాగుల రాములు అనే వ్యక్తిని 3,00,000/- లక్షల రూపాయలు అడుగగా, రాగుల రాములు తన పేరు మీద రాకం పెద్ద బాబు ఇంటిని రిజిస్ట్రేషన్ చేపిస్తేనే డబ్బులు ఇస్తానని చెప్పగా అందుకు ఒప్పుకొని రాగుల రాములు పేరు మీద పెద్ద బాబు ఇంటిని 2017 సంవసరములో రిజిస్ట్రేషన్ చేపించి 3,00,000 లక్షల రూపాయలు తీసుకొన్న తర్వాత

 Victims Of Ragula Ramulu Should File A Complaint At Sircilla Town Police Station-TeluguStop.com

అట్టి ఇంటిని రాగుల రాములు యాక్సిస్ బ్యాంకు నందు అట్టి ఇంటి పేపర్స్ పెట్టి 20 లక్షల రూపాయలు తీసుకున్నాడు అని రాకం పెద్ద బాబు తెలిసి రాగుల రాములును అడుగగా ఏమి చేసుకుంటావో చేసుకోమని, ఇచ్చిన డబ్బులకి మిత్తీ కట్టమనగా పెద్ద బాబు మిత్తి కట్టిన తర్వాత 47 రోజులకు ఇంటిని పెద్ద బాబు పేరు మిద రిజిస్ట్రేషన్ చేపిస్తానని చెప్పి 3,00,000, రుపాయలు , మిత్తి తీసుకున్న రిజిస్ట్రేషన్ చేయకుండా కాలం గడుపుతూ మోసం చేసినాడని రాకం పెద్ద బాబు పిర్యాదు మేరకు రాగుల రాములు పై సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో చిటింగ్ కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ తెలిపారు.

రాగులు రాములు కి సంబంధించిన బాధితులు ఎవరైనా ఉంటే సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయవలసిందిగా డిఎస్పీ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube