గురుకులానికి ఎంపికైన విద్యార్థులు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల చందుర్తి,గొల్లవాడ విద్యార్థులు బత్తుల నందిని ( చందుర్తి ),పాటి శ్రీ నిత్య ( గొల్లవాడ) రెండవ ఫేసులో ఐదవ తరగతిలో గురుకుల ప్రవేశ అర్హత సాధించడం పట్ల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మిఠాయి తినిపించి శాలువాలతో సన్మానించి అభినందించారు.

 Students Selected For Gurukula-TeluguStop.com

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ( Vikkurthi Lakshminarayana ) మాట్లాడుతూ ” ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులమైన ఉపాధ్యాయుల బోధన ద్వారా నాణ్యమైన విద్య లభిస్తుందని , విద్యార్థులకు ప్రభుత్వపరంగా ఉచిత పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు ,స్కాలర్షిప్లు మరియు పౌష్టికాహారం మధ్యాహ్న భోజనం , అల్పాహారంగా పౌష్టికాహార తాటి బెల్లంతో కూడిన రాగి జావా సదుపాయంతో పాటు బాలబాలికలకు వేరువేరుగా వాష్ రూమ్లు, పారిశుద్ధ తాగునీటి సౌకర్యం, రన్నింగ్ వాటర్ ,విశాలమైన తరగతి గదులు ,విశాలమైన ఆట స్థలములతో కూడిన ప్రభుత్వ పాఠశాల విద్య ను స్థానిక ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని , తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో బలోపేతానికి తమ వంతు కృషి చేయాలని “పేర్కొన్నారు.

మొదటి ఫేసులో ఏడుగురు విద్యార్థులు ,రెండవ ఫేసులో ఇద్దరు విద్యార్థులు మొత్తంగా 9 మంది విద్యార్థులు గురుకులంలో సీటు సాధించడం పట్ల స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube