ప్రతి గంట మానిటరింగ్... క్షేత్ర అధికారులకు మార్గదర్శనం

భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా కలెక్టరెట్ నుండి కలెక్టర్ మార్గదర్శనంరాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Anurag jayanthi ) క్షేత్ర పరిస్థితులను తెలుసుకుంటూ వర్షాల వల్ల ఉత్పన్నమైన సమస్యలను చక్కదిద్దేందుకు అధికారులకు మార్గదర్శనం చేశారు .గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకూ కలెక్టరేట్ లోని తన ఛాంబర్ నుండి అన్ని మండలాల తహశీల్దార్ లు, ఎంపిడిఓ లతో మాట్లాడారు.

 Hourly Monitoring Guidance To Field Officers , Field Officers, Anurag Jayanthi-TeluguStop.com

రిపోర్ట్ ను తెప్పించుకున్నారు.క్షేత్ర పరిస్థితులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

చెరువులు, కుంటలు తాజా పరిస్థితి, గ్రామాల్లో నీటి ప్రవాహాలు ఉదృతి నీ వివరాలు అడిగారు.గ్రామాల్లోని అన్ని చెరువులు, కుంటలు, నీటి ప్రవాహాల వద్ద రాత్రి పూట కూడా నైట్ డ్యూటీ లు వేసి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా మానిటరింగ్ చేయాలన్నారు.

లో లెవెల్ వంతెన లు, కాజ్ వేల గుండా కాలినడక, బైక్ లు, వాహనాల రాకపోకలు లేకుండా గట్టి చర్యలు చేపట్టాలన్నారు.టెలీ కాన్ఫరెన్స్ ( Teleconference )ద్వారా జిల్లా అధికారులు, మండల అధికారుల కు వర్షాల వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తం చేశారు.

ఈ రోజు, రేపు కూడా భారీ వర్షాల వల్ల జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నదృష్ట్యా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, మండల ,గ్రామ అధికారులకు కలెక్టర్ మార్గదర్శనం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube