సిరిసిల్ల పట్టణంలోని 36 వ వార్డు వెంకంపెట్ మండల ప్రజా పరిషత్ పాఠశాలకు స్థానిక కౌన్సిలర్ కల్లూరి రాజు ఆధ్వర్యంలో కొక్కుల నర్సయ్య పాఠశాలకు 12,000/- రూపాయలు గల మైక్ సౌండ్ సిస్టమ్ ను వితరణ చేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ కల్లూరి రాజు మాట్లాడుతూ ఉపాద్యాయులకు, విద్యార్థిని విద్యార్థులకు, పాఠశాలకు మైక్ సౌండ్ సిస్టమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని వితరణ చేసినటువంటి కొక్కుల నర్సయ్య ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మోర దామోదర్, ఉపాద్యాయులు, గడ్డం వెంకటేష్, ఎర్రం మల్లయ్య, గాజుల నర్సయ్య, కోడూరి మల్లేశం, గోక అశోక్, గోక సురేష్, జగిత్యాల మల్లేశం విద్యార్థులు పాల్గొన్నారు.